వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TV Blast: ఫోన్లే కాదు.. టీవీలు కూడా పేలుతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి..

|
Google Oneindia TeluguNews

ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో టీవీ ఉంటుంది. ఒకప్పుడంటే డబ్బా టీవీలు ఉండేవి.. కానీ ఇప్పుడు అన్నీ ఎసీడీ,ఎఈడీ టీవీలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా.. అక్కడే వస్తున్నామండి. ఇప్పుడు ఫోన్లు పేలిపోయినట్లే టీవీలు కూడా పేలుతున్నాయి. టీవీ పేలడమే కాదు.. దాని ఓ బాలుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని గాజియాబాద్‌లో జరిగింది.

బాలుడు మృతి
అమరేందర్ అనే 16 ఏళ్ల బాలుడు తన తల్లి, సోదరుడు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. ఈ పేలుడు దాటికి భవనం గోడలు పగుళ్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా.. తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే టీవీలు పేలడం చాలా అరుదని చెప్పుకోవాలి. అయితే ఈ టీవీలు పేలడానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 The incident where the boy died due to TV explosion happened in Uttar Pradesh

బ్రాండెడ్ టీవీ
విద్యుత్తు ఓల్టెజ్‌ హెచ్చుతగ్గులకు లోనవటమూ ఓ కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా హైఓల్టేజ్‌ సరఫరా అవుతే టీవీలు పేలిపోతాయని వివరించారు. ఎల్‌ఈడీ టీవీల్లో నకిలీ కెపాసిటర్‌ ఉపయోగించడం వల్ల కూడా టీవీలు పేలుతాయట. టీవీ ఎక్కువ సేపు ఆన్ లో ఉంచడం వల్ల వేడెక్కుతుంది. దీంతో అది పేలిపోయే అవకాశం ఉందట. బ్రాండెడ్ టీవీలను కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

English summary
A boy died after a TV exploded in Ghaziabad, Uttar Pradesh. Two others were injured. They were taken to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X