ఇది చెన్నై నగరమే: ఏరియల్ సర్వే (వీడియో)
చెన్నై: భారత వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) అధికారులు చెన్నై నగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాలలో ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అని క్షుణ్ణంగా పరిశీలించారు.
పలు లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై నగరంలో పలు సార్లు ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వం సేకరించిన ఆహార పొట్లాలు వరద బాధితులకు సరఫరా చేశారు.
పలు స్వచ్చంద సంస్థలు, వివిద సంఘాలు సేకరించిన ఔషదాలు, దుస్తులు, తాగు నీరు బాటిల్స్ సరఫరా చేశారు. ఆహార పొట్లాల కోసం ప్రజలు పోటీపడ్డారు. అయితే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ వృదా కాకుండ జాగ్రత్తలు తీసుకున్నారు.
వివిద ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన నిత్యవసర వస్తులు, ఔషదాలు దుర్వియోగం కాకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులు సూచించిన ప్రాంతాలలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications