అదానీపై నేరారోపణలు- అమెరికా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు

Adani: ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచీకరణ మధ్య సూపర్ పవర్‌‌గా ఎదగాలనుకునే ఏ దేశానికైనా వ్యూహాత్మక విధానాన్ని అనుసరించడం అత్యవసరం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికా అవలంభిస్తోన్న విధానాలు వివాదాలకు దారి తీస్తోన్నాయి.

ఈ విధానాలు, చర్యలు- చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను ఎదుర్కొనడానికి సంసిద్ధమౌతోన్న ప్రపంచదేశాల కూటమికి ప్రతికూలంగా పరిణమించినట్టు కనిపిస్తోంది. ఆయా దేశాలకు విరుద్ధంగా అమెరికా రాజీ ధోరణిని ప్రదర్శిస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.

The indictment of Gautam Adani by the US has raised questions

భారత ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ శాఖ చేసిన నేరారోపణే దీనికి ఉదాహరణ. ఈ నేరారోపణ చేయడం ద్వారా అమెరికా తన ప్రయోజనాలను తాను దెబ్బతీసుకుంటోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.

దాదాపు 150 దేశాలను కలుపుతూ ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి విస్తారమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉద్దేశించిన నెట్‌వర్క్ బీఆర్ఐ. దీని ద్వారా చైనా తన ప్రభావాన్ని మరింత దూకుడుగా విస్తరించుకోవడం మొదలు పెట్టింది. కొత్త సిల్క్ రోడ్‌గా భావిస్తోన్న ఈ నెట్ వర్క్ ద్వారా మధ్య- తూర్పు, దక్షిణాసియాతో సహా ప్రపంచ వాణిజ్యానికి గట్టి పట్టు ఉన్న ఈ రీజియన్‌పై చైనా ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతుంది.

చైనా వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో కీలక దేశాలు పాకిస్తాన్, ఇరాన్‌. ఈ రెండూ కూడా యూరప్‌, దాని మిత్రదేశాలు- ప్రత్యేకించి సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌కు భౌగోళిక, రాజకీయ సవాళ్లను విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటర్ బ్యాలెన్స్ అవసరం ఉందని గుర్తించింది భారత్.

ఈ క్రమంలో అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా యూరోపియన్ శక్తులతో కలిసి 2023లో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)ని ప్రారంభించింది. భారత్‌లోని అన్ని ఓడరేవులను యూరప్‌కు కనెక్ట్ చేయడం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించడానికి అబ్రహం అకార్డ్‌ను అమలు చేస్తూ మధ్య- తూర్పు దేశాల గుండా సాగుతోన్న వాణిజ్య మార్గాలను మరింత పురోగమింపజేస్తుందీ ప్రాజెక్ట్. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. IMEC వల్ల రవాణా, ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. చైనా BRIకి గట్టి పోటీ ఇస్తోంది.

వ్యూహాత్మక వాటాలు ఉన్నందున యూరోపియన్ దేశాలు IMECకి మరింత మద్దతు ఇస్తాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అయినప్పటికీ- 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు అదానీపై లంచం నేరారోపణ చేయాలంటూ అమెరికా న్యాయ శాఖ నిర్ణయించుకోవడం వల్ల ఈ ప్రణాళిక మొత్తం చెల్లాచెదురయ్యే ప్రమాదం లేకపోలేదు.

భారత్, ఇతర దేశాల అంతటా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న అదానీ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌లోని పోర్ట్ హైఫాను సొంతం చేసుకోవడం, IMEC కార్యకలాపాలను మరింత విస్తరింపజేసినట్టయింది. కీలక పోర్టుల్లో భారత్‌కు ప్రత్యక్ష వాటాలను కల్పించనట్టయింది.

కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అమెరికా బయట వెలువడిన నేరారోపణలకు సంబంధించి ఆ దేశ అధ్యక్ష ఎన్నికల ముంగిట్లో ఈ కేసు వెలుగులోకి రావడం దుర్మార్గంగా భావిస్తోన్నారు. చట్టపరమైన సంక్లిష్టతలు ఈ కేసు విచారణను మరింత పొడిగించే అవకాశం ఉంది.

ఫలితంగా- కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై నీలినీడలు అలముకునే ప్రమాదం లేకపోలేదు. అదే సమయంలో భారత్‌లో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో పెట్టుబడులపై అవిశ్వాసాన్ని కలిగించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+