Karnataka assembly election results 2023: నేడే కర్ణాటక ఫలితాలు.. హంగ్ తప్పదా..!

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 223 అసెంబ్లీ స్థానాలునాన్న కర్ణాటకలో 113 సీట్లు సాధించిన పార్టీకి అధికారం దక్కుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కర్ణాటకలో హంగ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఇండియా టీవీ, జీ న్యూస్, ఏబీపీ, టీవీ 9, టైమ్స్ నౌ వంటి ఛానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం దక్కింది. వీటితో పాటు జన్ కీ బాత్, సీ ఓటర్, సువర్ణ న్యూస్, టుడేస్ చాణక్య, ఆత్మసాక్షి వంటి సర్వే సంస్ధల ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో ఆధిక్యం లభిస్తోంది.

karnatakaelections1

ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 122 నుంచి 140 సీట్లు సాధించి అధికారం చేపట్టబోతోందని అంచనా వేసింది. ఇండియా టీవీ సర్వేలోనూ 110 నుంచి 120 స్ధానాల్లో కాంగ్రెస్ గెలవబోతోందని అంచనా వేసింది.

అలాగే జీ న్యూస్ సర్వేలోనూ కాంగ్రెస్ 103-118 సీట్లు సాధించబోతున్నట్లు తేలింది. టుడేస్ చాణక్య సైతం 120 సీట్లు కాంగ్రెస్ గెల్చుకుంటుందని చెప్పింది. సువర్ణ న్యూస్ బీజేపీకి 94-117 సీట్లు వస్తాయని, న్యూస్ నేషన్(న్యూస్ 18) 114 సీట్లు వస్తాయని, సర్వే సంస్ధ రాజ్ నీతి బీజేపీకి 100 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.

ఇక 2018లో బీజేపీకి 104, కాంగ్రెస్ పార్టీకి 80, జేడీఎస్‌కు 37 స్థానాలు వచ్చాయి. బీఎస్పీ తరఫున ఒకరు, కర్ణాటక ప్రజ్ఞవంత పార్టీ తరఫున ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలుపొందారు. అప్పుడు పోలింగ్ 72.50 శాతం నమోదైంది.

2018లో టైమ్స్ నౌ- టుడేస్ చాణక్య ఒక్కటే బీజేపీకి స్పష్టమైన అధిక్యత వస్తుందని అంచనా వేసింది. 120 స్థానాలు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. మిగిలిన అన్నీ సంస్థలు హంగ్ వస్తుందని తెలిపాయి.

ఇప్పుడు హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ గా మారనుంది. అందుకే జేడీఎస్ తో బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జేడీఎస్ నేతలతో సింగపూర్ లో మంతనాలు జరిపినట్లు పలు కథనాలు కూడా వచ్చాయి. ఇటు కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కు 100కు పైగా సీట్లు వస్తే ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తోంది. కాంగ్రెస్ కూడా జేడీఎస్ తో చర్చలు జరపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+