బీజేపీకి గులాబ్ జామ్ తినిపిస్తున్న సిద్దూ, అన్ని స్కామ్ లపై న్యాయ విచారణ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆడుకున్నదని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు లాగడానికి సిద్దం అయ్యింది.
బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌తో సహా పలు స్కామ్‌ల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన కాంగ్రెస్, 40 శాతం అవినీతి కేసును న్యాయ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. 40% కమీషన్ కుంభకోణానికి సంబంధించిన సాక్షాలను అడుగుతున్న బీజేపీ నాయకులకు త్వరలో ఆధారాలు ఇచ్చేందుకు విచారణ కమిటీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అంటోంది.

బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణపై ట్వీట్ చేసిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ 40 శాతం కమీషన్ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు దర్యాప్తు కమిటీ ఇప్పుడు సాక్షాలతో సహ సంబంధిత పత్రాలను ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. న్యాయ విచారణ ద్వారా కర్ణాటకలోని బీజేపీ అవినీతి బయటపడుతుందని, ఎవ్వరిని వదిలిపెట్టమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటోంది.
బీజేపీ అవినీతి నాయకుల కోసం కొత్తగా జైలును నిర్మించాలని, లేదంటే బీజేపీ కార్యాలయానికే కమ్మీలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవ చేసింది. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను గత అసెంబ్లీ ఎన్నికల ముందు కుదిపేసింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ పనులకు 40 శాతం కమీషన్ ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని. పలు పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న గతంలో బహిరంగంగా ఆరోపించారు.
దీనిపై విచారణ జరిపించాలని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి అప్పట్లోనే లేఖ రాశారు. దీని తరువాత అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడంలో ఇవే ఆరోపణలు ముందు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి నేడు అధికారంలోకి వచ్చింది.
ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అప్పటి కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఫోటోలతో పే సీఎం అంటూ QR కోడ్ తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ తీరుతో బీజేపీ నాయకులు మండిపడినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా బీజేపీ 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బీజేపీపై విరుచుకుపడింది.

ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బిట్‌కాయిన్ స్కామ్, చామరాజనగర్ ఆక్సిజన్ డిజాస్టర్ సహా పలు అవినీతి కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 40 శాతం కమీషన్ కుంభకోణంపై న్యాయ విచారణ జరుగుతోందని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.వీరప్ప నేతృత్వంలో విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తోందని సిద్దరామయ్య ప్రభుత్వం అంటోంది. గంగా కళ్యాణ్ బోర్ వెల్ కేసు, ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ అక్రమాల కేసు, బిట్‌కాయిన్ స్కామ్ తో సహ పలు కుంభకోణాల యొక్క స్వభావాన్ని బట్టి కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది.

40% కమీషన్ అని బీజేపీపై మేము ఆ పార్టీ మీద ఆరోపణలు చేయలేదని, కాంట్రాక్టర్లు స్వయంగా బీజేపీ మీద ఆరోపణలు చేశారని, దానినే మేము ప్రజలకు చెప్పామని కర్ణాటక ఐటీ, బీటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ప్రియాంక్ ఖర్గే అంటున్నారు. మొత్తం మీద గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, బీజేపీ నాయకులకు సినిమా చూపించాలని సిద్దరామయ్య ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications