Kerala High Court: పిల్లలకు వండి పెట్టండి.. బయటి ఫుడ్ వద్దు.. కేరళ హైకోర్టు సూచన..
ఎంతగా టెక్నాలజీ పెరుగుతోందో.. మనుషుల్లో అంతగా బద్దకం పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు వచ్చిన తర్వాత చాలా మంది వండుకోవడమే మానేశారు. కూర్చున్న సీట్ లో మొబైల్ ఓపెన్ చేసి అందులో స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసి ఫుడ్ ఆర్ఢర్ చేస్తున్నారు. అంతకు ముందు బయట ఫుడ్ తినాలంటే బయటలు వెళ్లాల్సి వచ్చేది. దీని కొందరు బయటకు ఏం వెళ్తాము లే.. ఇంట్లోనే వంట చేసుకుని తినేవారు.. కానీ ఇప్పుడు ఫుడ్ డెలవరీ యాప్ లు వచ్చి తర్వాత గరిట తిప్పడం చాలా తక్కువ చేశారు.
చివరికి పిల్లలకు కూడా బయట ఫుడ్ పెడుతున్నాయి. తాజాగా బయటి ఫుడ్ కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంట్లోనే వండిపెట్టాలని సూచించింది. స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసే బదులు.. తల్లి వండిన రుచికరమైన ఆహారాన్ని పిల్లలకు తినిపించాలని కోరింది. " పిల్లలకు స్వేచ్ఛనివ్వండి.. ఖాళీ సమయంలో క్రికెట్ లేదా ఫుట్‌బాల్ లేదా వారు ఇష్టపడే ఇతర క్రీడలను ఆడనివ్వండి. అలాగే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్విగ్గీ, జొమాటో నుండి ఆర్డర్ చేసే బదులుగా తల్లి వండిన మైమరిపించే వంటకాల సువాసనను ఆస్వాదించనివ్వండి" అని వ్యాఖ్యానించిదంి.

భావితరాలదే భవిష్యత్ అని కేరళ న్యాయస్థానం స్పష్టం చేసింది. వారు ఆరోగ్యం ఉండాలంటే ఇంటి వంటే తింటేనే బాగుంటుందని అభిప్రాయపడింది. యువ తరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలా లేదా అన్నది తల్లిదండ్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేసింది. నిజానికి కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయటి ఫుడ్ ఎంత వరకు మంచిదో మనకు తెలియదు. మనం రోజూ చూస్తున్నాం. నకిలీ అల్లం, కలుషిత పదార్థాలతో వంటలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ కల్తీ వెల్లుల్లి పెస్ట్, కల్తీ నూనె ఇలా ప్రతి ఒక్కడి కల్తీ అయ్యాయి. దీంతో కొన్ని రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తక్కువ ధరకు కల్తీ పదార్థాలు కొనుగోలు చేసి వంటలు చేస్తున్నాయి. వంటకాల్లో మాసాలు వాడడం వల్ల రుచికరంగా మారుతాయి. దీంతో చాలా మంది బయట ఫుడ్ అలవాడు పడి అనారోగ్య పాలవుతున్నారు. పెద్దలు తింటే ఫర్వాలేదు కాని పిల్లలకు కూడా బయటి ఫుడ్డే పెడుతున్నారు. దీని పైనే కేరళ హైకోర్టు పై విధంగా స్పందించింది.












Click it and Unblock the Notifications