Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను చంపేస్తామని మాజీ ఎమ్మెల్యే బ్యాచ్ బెదిరిస్తోంది, అసెంబ్లీలో లేడీ ఎమ్మెల్యే ఫైర్ !

బెంగళూరు: తాను ప్రాతినిథ్యం వహిస్తున్న దేవదుర్గ నియోజకవర్గంలో అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే కరియమ్మ కర్ణాటక శాసనసభ సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనుచరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, తాను ఫిర్యాదు చేస్తే ఎవరి పేర్లు తీసుకోకుండా పోలీసులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కరియమ్మ ఆరోపించారు

తొలిసారిగా ఎమ్మెల్యే అయిన కరియమ్మ చేస్తున్న ఆందోళనలపై చర్యలు తీసుకునేందుకు హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తో మాట్లాడతానని స్పీకర్ యూటీ. ఖాదర్ మహిళా ఎమ్మెల్యేకి హామి ఇచ్చారు. నా నియోజకవర్గ ప్రజలు ప్రశాంతమైన దేవదుర్గాన్ని కోరుకుంటున్నారు. అయితే అక్కడ అక్రమ మద్యం, మట్కా, జూదం, అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నదని కరియమ్మ ఆరోపించారు.

 ladymla

శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కరియమ్మ జోక్యం చేసుకుంటూ దేవదుర్గలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై పోలీసు అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, మట్కా, ఇతర అక్రమాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే రూ. 300 జరిమానా విధించి వదిలేస్తున్నారని ఎమ్మెల్యే కరియమ్మ ఆరోపించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన నా లాంటి మహిళను దేవదుర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, అయితే తమ ప్రజలకు ఎలా న్యాయం చెయ్యాలో అని తాను చాలా ఆందోళన చెందుతున్నానని ఎమ్మెల్యే కరియమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా మాజీ ఎమ్మెల్యే అనుచరులు నన్ను వేధిస్తున్నారు, అక్రమ ఇసుక వ్యాపారం ఆగిపోవడంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోతున్నారని కరియమ్మ ఆరోపించారు.

 ladymla

21 ఏళ్ల యువకుడిని వీధుల్లో కొట్టారు. ఎవరిని అడగాలి చెప్పండి, నాకు అధికారం ఉందని, సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలు నమ్ముతున్నారు. కానీ నాకు ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియడం లేదని, కాబట్టి నాకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మ కన్నీరు పెట్టుకున్నారు.

అక్రమ మద్యం, మట్కా, జూదం, అక్రమ ఇసుక వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా బాధ్యులు తమ పదవుల్లోనే కొనసాగుతున్నారని దేవదుర్గ ఎమ్మెల్యే కరియమ్మ ఆరోపించారు. కొందరు నన్ను అనరాని మాటలతో దూషించారు, నాపై లారీ నడుపుతామని, చంపేస్తామని బెదిరించారని, తనను నిజంగా చంపేస్తారనే భయంగా ఉందని ఎమ్మెల్యే కరియమ్మ ఆరోపించారు.

ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు రాత్రికి రాత్రే ముందుకెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించానని దేవదుర్గ ఎమ్మెల్యే కరియమ్మ అన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కోసం, కానీ వారు ప్రోటోకాల్‌ను కూడా గౌరవించలేదని, తనకు పోలీసు రక్షణ కల్పించడం లేదని, తాను ఎమ్మెల్యే అయ్యానా, లేదా అనే అనుమానం వస్తోందని జేడీఎస్ పార్టీకి చెందిన కరియమ్మ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+