బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ లాంచనాలతో పంచభూతాల్లో కలిసిపోయిన శాండిల్ వుడ్ కర్ణుడు: తరలివచ్చిన ప్రముఖులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, కర్ణాటక కర్ణుడిగా పేరు తెచ్చుకున్న అంబరీష్ అంత్యక్రియలు హిందూ సాంప్రధాయం ప్రకారం శాంతియుతంగా జరిగాయి. అంబరీష్ కుమారుడు అభిషేక్ తండ్రి చితికి నిప్పంటించారు. సోమవారం సాయంత్రం కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంచనాలతో రెబల్ స్టార్ అంబరీష్ అంత్యక్రియలు జరిగాయి. అభిమానులు శాంతియుతంగా అంబరీష్ కు అంతిమ వీడ్కోలు పలికారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు తరలి వచ్చారు.

యుద్దవిమానం

యుద్దవిమానం

మండ్యలోని శ్రీ విశ్వేశ్వరయ్య స్టేడియం నుంచి ప్రత్యేక యుద్ద విమానంలో సోమవారం ఉయదం 10 గంటల సమయంలో అంబరీష్ పార్థీవదేహాన్ని బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో జీరో ట్రాఫిక్ తో రోడ్డు మార్గంలో కంఠీరవ స్టేడియం దగ్గరకు అంబరకీష్ పార్థీవదేహాన్ని తీసుకువచ్చారు.

13 కిలోమీటర్ల యాత్ర

13 కిలోమీటర్ల యాత్ర

కంఠీరవ స్టేడియం నుంచి హలసూరు గేట్ పోలీస్ స్టేష్, మైసూరు బ్యాంక్ సర్కిల్ తదితర రహదారుల మీదుగా మొత్తం 13 కిలో మీటర్ల ఊరేగింపుతో అంబరీష్ పార్థీవదేహాన్ని కంఠీరవ స్టూడియో దగ్గర వరకు తీసుకు వచ్చారు. మార్గం మద్యలో ఎలాంటి అంవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

11 వేల మంది పోలీసులు

11 వేల మంది పోలీసులు

కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు జరిగిన ఊరేగింపులో 11 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. బెంగళూరు నగర పోలీసులతో పాటు కేఎస్ఆర్ పీ, సీఆర్ పీ, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లీంచారు. కంఠీరవ స్టేడియంలోకి వాహనాలు ప్రవేశించకుండా నిషేధించారు.

మొహన్ బాబు కన్నీరు

మొహన్ బాబు కన్నీరు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, శ్రీ నిర్మలానందస్వామిజీ, మహారాష్ట్ర సీఎం సుశీల్ కుమార్ సింథే, మీజీ సీఎం యడ్యూరప్ప, చాలెంజింగ్ స్టార్ దర్శన్, కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగు నటుడు మొహన్ బాబు, ఆయన సతీమణి, కుమారుడు మంచు విష్ణు, కన్నడ సినీ ప్రములు, మాజీ మంత్రులు తదితరులు అంబరీష్ కు తుదివీడ్కోలు పలికారు.

కుమారుడు అభిషేక్

కుమారుడు అభిషేక్

అంబరీష్ సతీమణి సుమలత, వారి కుమారుడు అభిషేక్ తుదివీడ్కోలు పలికే సమయంలో చితి దగ్గర కన్నీరుమున్నీరు అయ్యారు. హిందూ సాంప్రధాయం ప్రకారం అంబరీష్ చితికి ఆయన కుమారుడు అభిషేక్ నిప్పంటించారు. అంబరీష్ అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అక్కడే ఉన్నారు.

English summary
The last rites of rebel star ambareesh, carried according to Hindu Tradition at Kanteerava Studios in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X