Kangana: కంగనాకు షాక్, దిద్దా ఎఫెక్ట్, ఎఫ్ఐఆర్ కు కోర్టు ఆదేశం, మేడమ్ కు కాపీరైట్ దెబ్బ !
ముంబాయి: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా ఓ ఊపుఊపేస్తున్న క్వీన్ కంగనా రనౌత్ కు మరో చిక్కు ఎదురైయ్యింది. దిద్దా (వారియర్ క్వీన్ ఆఫ్ కాశ్మీర్) అనే పుస్తక రచయిత కారణంగా మేడమ్ కంగనా రనౌత్ మీద కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసే పనిలో ముంబాయి పోలీసులు బిజీ అయ్యారు. అమ్మ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాతో చాలా బిజీ అయిన కంగనాకు వరుసగా సినిమా కష్టాలు మొదలు కావడంతో ఆమె సన్నిహితులు హడలిపోతున్నారు.

దిద్దా ఎఫెక్ట్
వరుసగా సినిమాలు చేస్తున్న కంగనా రనౌత్ బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దిద్దా 'వారియర్ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ ' అనే పుస్తక రచయిత ఆశిష్ కౌల్ ఇప్పుడు కంగనా రనౌత్ మీద న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యి ముంబాయి కోర్టును ఆశ్రయించారు.

నాకు ఆ హక్కు ఉంది
దిద్దా పుస్తకం నేను రాశానని, ఆ పుస్తకం హిందీలోకి అనువాదం అయ్యిందని ఆశిష్ కౌల్ అంటున్నారు. సామాజిక కార్యకర్తగా మారి సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ తన పుస్తకాన్ని చోరీ చేసిందని, అది ఆమె స్థాయికి సరిపోతుందా అని ప్రశ్నించారు. తన అనుమతి తీసుకోకుండా ఆ పుస్తకాన్ని ఆమె పాపులారిటీ కోసం ఉపయోగించుకుని మాకు ద్రోహం చేస్తోందని అశిష్ కౌల్ ఆరోపిస్తున్నారు.

కంగనాకు కాపీ రైట్ దెబ్బ
కంగనా రనౌత్ తన పుస్తకాన్ని ఆమె స్వార్థం కోసం ఉపయోగించుకుందని, తన పుస్తకం దుర్వినియోగం చేశారని, తనకు న్యాయం చెయ్యాలని రచయిత ఆశిష్ కౌల్ ముంబాయి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ముంబాయి కోర్టు నటి కంగనా రనౌత్ మీద కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ముంబాయి పోలీసులు కంగనా రనౌత్ మీద కేసు నమోదు చేసి ఆమె మీద చర్యలు తీసుకునే పనిలో బిజీ అయ్యారు.

కంగనాకు సినిమా కష్టాలు
ఇప్పటికే రైతులను చులకనగా మాట్లాడిందని, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు రాజకీయ నాయకులను నోటికి వచ్చినట్లు దూషించిందని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో ఆమె మీద కేసులు నమోదు అయ్యాయి. వరుస బయోపిక్ సినిమాలు చేస్తూ బిజీ అయిన కంగనా రనౌత్ కు ఇప్పుడు కేసుల కారణంగా వరుసగా సినిమా కష్టాలు మొదలైనాయని ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications