రష్యా లూనా -25 ప్రయోగంలో సాంకేతిక సమస్య : చంద్రుడిపై దిగాల్సిన వేళ..!!

చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా -25లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నెల 10న రష్యా ప్రయోగించిన లూనా -25లో శనివారం సాంకేతిక సమస్య గుర్తించినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడించింది. చంద్రుడిపై దిగేందుకు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ముందు దీనిని గుర్తించినట్లు తెలిపింది. ఈ సమస్య తాజా ప్రయోగం పైన ప్రభావం పడుతుందా లేదా అనేది సంస్థ స్పష్టత ఇవ్వలేదు.

చంద్రుడిపైన రష్యా ప్రయోగించిన లూనా -25 ఈ నెల 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. కాగా, శనివారం సాంకేతిక సమస్య వెలుగు చూసింది. దీని వలన ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. ప్రయోగంలో ఎలాంటి మార్పులు లేకపోతే లూనా -25 ఈ నెల 21న చంద్రుడి దక్షిణ ద్రువం పై దిగేలా షెడ్యూల్ అయింది. దాదాపు 50 ఏళ్ల విరామం తరువాత రష్యా చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా -25ని రష్యా ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది.

The Luna-25 spacecraft has suffered an emergency situation above moon, Roscosmos says

ఇదే సమయంలో భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన -3 కీలక దశలు పూర్తి చేసింది. ఇక, చంద్రుడిపై దిగేందుకు సిద్దంగా ఉంది.జాబిల్లికి కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందని ఇస్రో అర్ద్రరాత్రి తరువాత ప్రకటించింది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ఫైనల్ డీ బూస్టింగ్ అపరేషన్ చేపట్టి విజయంతంగా ల్యాండర్ ను దిగువ కక్ష్యకు చేర్చారు. దీంతో చంద్రుడి నుంచి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది.

విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25 కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తి కావటంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగటం మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలకంగా భావిస్తున్న చివరి దశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ పై దృష్టి పెట్టారు. ఎంచుకున్న ల్యాండింగ్ లో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఇదే క్రమంలో ముందుకు సాగితే అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడు పై అడుగు పెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+