జయలలిత చికిత్స వీడియో విడుదల, ఊపిరిపీల్చుకున్న వెట్రివేల్, షరతులు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ గూటిలో చేరి అనర్హతకు గురైన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే వెట్రివేల్ పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకుని తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.

హై కోర్టు షరతులు

హై కోర్టు షరతులు

అన్నాడీఎంకే అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ కు గురువారం మద్రాసు హైకోర్టు షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ ను బహిష్కరించిన సమయంలో ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద తిరుబాటు చేశారు.

ఆర్ కే నగర్ ఎఫెక్ట్

ఆర్ కే నగర్ ఎఫెక్ట్

ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో వెట్రివేల్ ఉన్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీటీవీ దినకరన్ వెంటే ఉన్న వెట్రివేల్ క్రమం తప్పకుండా ప్రతి రోజూ ప్రచారం చేశారు. టీటీవీ దినకరన్ ను స్కూటర్ మీద ఎక్కించుకుని వెట్రివేల్ స్వయంగా ద్విచక్ర వాహనం నడిపారు.

దేశ వ్యాప్తంగా చర్చ

దేశ వ్యాప్తంగా చర్చ

జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఓ వీడియోను ఆర్ కే నగర్ ఉప ఎన్నిక పొలింగ్ కు ఒక్క రోజు ముందు వెట్రివేల్ మీడియాకు విడుదల చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

ఎన్నికల కమిషన్ సీరియస్

ఎన్నికల కమిషన్ సీరియస్


ఆర్ కే నగర్ పొలింగ్ కు ఒక్క రోజు ముందు జయలలిత ఆసుపత్రి చికిత్స పొందుతున్న వీడియో విడుదల చేసి ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన వెట్రివేల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ అధికారులు చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 అరెస్టు భయంతో మాయం

అరెస్టు భయంతో మాయం

చెన్నై పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో మాయం అయిన వెట్రివేల్ ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వెట్రివేల్ అర్జీ పరిశీలించిన మద్రాసు హైకోర్టు షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది. జామీను రావడంతో వెట్రివేల్ తో పాటు టీటీవీ దినకరన్ వర్గీయులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Madras high court issues conditional anticipatory bail for Vettrivel. Vettrivel released Jayalalitha treatment video one day before of RK Nagar by poll.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి