ఇది దెబ్బ: రంగంలోకి కరుణానిధి, పన్నీర్ కాదు, రిసార్ట్ ఎమ్మెల్యేలతో !
చెన్నై: తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం) పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయిన తమినాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ కురుణానిధి రంగంలోకి దిగారు.
అన్నాడీఎంకే పార్టీలో వచ్చిన చీలికను తామకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే పార్టీ నాయకులు ఒత్తిడి చెయ్యడంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయుడు అయిన ఎంకే. స్టాలిన్ గురువారం మద్నాహ్నం కరుణానిధితో చర్చించారు.
ప్రస్తుత పరిస్థితిలో అతిగా ముందుకు పోవడం మంచిది కాదని కరుణానిధి స్టాలిన్ కు సూచించారని తెలిసింది. అందుకనే డీఎంకే పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని జాగ్రత్తగా పావులుకదుపుతున్నాయని సమాచారం.

తమిళనాడులో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే కంటే రిసార్ట్ లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని డీఎంకే పార్టీ నిర్ణయించిందని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శశికళ వర్గం నాయకులు అలర్ట్ అయ్యారు.
గురువారం డీఎంకే శాసనసభా పక్షం సమావేశం నిర్వహించాలని కరుణానిధి సూచించడంతో తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శాసన సభ్యులు అందరూ వెంటనే చెన్నై రావాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే అన్నాడీఎంకేలోని రెండు వర్గాలను పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే మనకే మంచిదని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని డీఎంకే పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మొత్తం మీద కరుణానిధి రంగంలోకి దిగడంతో అన్నాడీఎంకే లోని రెండు వర్గాలు హడలిపోతున్నాయి.












Click it and Unblock the Notifications