దంపతుల గొడవలో జోక్యం: వైద్యుడి పై దాడి
కోయంబత్తూరు: నా భార్యతో గొడవపడుతుంటే మద్యలో నీవెందుకు మాట్లాడుతావు అంటు రెచ్చిపోయి ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యుడిని చితకబాదేశాడు. మద్యం మత్తులో వైద్యుడి మీద ప్రతాపం చూపించి ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని మెట్టుపాళ్యంలో శివకుమార్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను నిత్యం మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. నాలుగు రోజుల క్రితం పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు.
భార్యను పట్టుకుని చితకబాదాడు. తీవ్రగాయాలు కావడంతో బంధువులు ఆమెను మెట్టుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడే చికిత్స పోందుతున్నది. శుక్రవారం ఆమెకు వైద్యుడు చికిత్స చేస్తున్న సమయంలో శివకుమార్ అక్కడికి వెళ్లాడు.

భార్యను బూతులు తిట్డడం మొదలు పెట్టాడు. చికిత్స చేస్తున్న వైద్యుడు జోక్యం చేసుకుని ఆమెకు ఇప్పుడే ఆరోగ్యం బాగులేదని, ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించాడు. నా పెళ్లాం ను తిడితే నువ్వు ఎవడు మాట్లాడటానికి అని ఎదురుతిరిగాడు.
నా భార్యకు వైద్యం చెయ్యడానికి నీకు ఎంత ధైర్యం అంటు ప్రభుత్వ వైద్యుడిని పట్టుకుని చితకబాదేశాడు. ఇక ముందు మా గొడవలో జోక్యం చేసుకుంటే నీ అంతు చూస్తాను అంటు వార్నింగ్ ఇచ్చాడు. మత్తు తలకెక్కడంతో భార్య మంచం పక్కనే కునుకు తీశాడు.
వైద్యుడు ఫిర్యాదు చేయ్యడంతో పోలీసులు శివకుమార్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతనిని మెట్టుపాళ్యం కోర్టులో హాజరుపరిచారు. శివకుమార్ ను 15 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గురుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.












Click it and Unblock the Notifications