జయలలిత పిలిచినా నో చెప్పి: మృతిపై ప్రతీకారం కోసం నేడు 'అమ్మ' పార్టీ

జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి కొత్తగా 'అమ్మ' పార్టీ వచ్చింది.

చెన్నై: జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి కొత్తగా 'అమ్మ' పార్టీ వచ్చింది. 2015లో జయలలిత జైలకు వెళ్లినప్పుడు ఆమె కేసు నుంచి బయటపడాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ శిలువ వేసుకున్న షిహాన్‌ హుస్సైనీ ఈ పార్టీని స్థాపిస్తున్నాడు.

ఇప్పుడు ఆయన 'అమ్మ- అమ్మ మక్కల్‌ మునెట్ర అమైప్పు' అనే పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. అమ్మ మరణంపై ప్రతీకారం తీర్చుకోవడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. తనకు తానుగా సంచలన వ్యక్తినని ప్రకటించుకున్న హుస్సైనీ గతంలో ఎన్నో సాహసకృత్యాలతో రికార్డులు సాధించాడు.

కరాటే మాస్టర్‌ అయిన హుస్సైనీ 101 కార్లను తన ఎడమ చేతిపై నుంచి నడిపించుకుని రికార్డ్ సృష్టించాడు. అనంతరం తన రక్తంతో జయలలిత చిత్రాన్ని గీసి అభిమానం చాటుకున్నాడు.

The man who crucified himself for Jayalalithaa is starting a political party called 'AMMA'

హుస్సైనీ మాట్లాడుతూ... రాజకీయాల్లోకి రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులే తనను పార్టీ పెట్టేలా ప్రేరేపించాయన్నారు. గతంలో జయలలిత చాలాసార్లు తనని రాజకీయాల్లోకి వస్తావా అని అడిగారని, తాను రానని చెప్పానన్నారు.

అసలు అమ్మకు ఏమైందో ప్రజలకు తెలియజెప్పడమే తమ పార్టీ ప్రథమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఆ పార్టీని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న వారే ఆమె మరణానికి పథకం పన్ని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ముందుండి నడవకపోతే ఇంకెవరూ ఇందుకు సాహసించరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+