Supreme Court: మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశ్నల వర్షం..

మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై జాతీయ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. దేశంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని సుప్రీం హెచ్చరించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.

గత రెండు నెలలుగా మణిపూర్ జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మే 4న ఇద్దరు మహిళలను కొంతమంది పురుషులు నగ్నంగా ఊరిలో తిప్పారు. ఇందుకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై మోడీ కూడా స్పందించారు.

supreamcourt1

నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మనది మహిళలను గౌరవించే సంస్కృతిని చెప్పారు. ఇలాంటి ఘటనల జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఘటనపై స్పందించారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఫోన్ చేశారు. నిందితులను కఠింగా శిక్షంచాలని కోరారు.

మరోవైపు మణిపూర్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మణిపూర్ డీజీపీని ఆదేశించింది. ట్విట్టర్ కూడా నోటీసు ఇచ్చింది. మణిపూర్ ఘటన పై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడి చేయడమంటే మానవత్వం దాడి చేయడమే అని రితీష్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.

మణిపూర్ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. "మోదీజీ.. అమిత్​షా జీ.. మీరు ఎక్కడున్నారు. మణిపుర్ ​లో తాలిబన్​తరహా ఘటన జరుగతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది. తాలిబన్లు పిల్లలను, మహిళలను అగౌరవపరిస్తేనే.. ఇండియన్స్​ గా మనం వారిపై విరుచుకుపడుతున్నాం. అలాంటిది.. మణిపుర్ ​లో కుకీ తెగ మహిళల్ని మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం బాధాకరం " అని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+