హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు అసాదుల్లా
బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు లష్కర్ -ఏ-తోయిబా ఉగ్రవాది అసాదుల్లాను హైదారాబాద్ నుంచి బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఉగ్రవాది అసాదుల్లాను బెంగళూరు నగరంలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
న్యాయమూర్తి అనుమతితో బుధవారం అసాదుల్లాను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఎంత మందిని టార్గెట్ చేసుకున్నాడు అంటూ ఆరా తీస్తున్నారు.
పోలీసు అధికారులు, విలేకరులు, కొందరు రాజకీయ ప్రముఖులను హత్య చెయ్యడానికి లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నారని బెంగళూరు సీసీబీ పోలీసులు 2012 లో 12 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.

ఉగ్రవాది అసాదుల్లాతో ఈ 12 మందికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేశారు. 2012 ఆగస్టు 29వ తేదిన ఓ విలేకరి, ఓ సైంటిస్ట్ తో పాటు 12 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు అయిన 12 మందితో పాటు మొత్తం 25 మంది మీద కేసులు నమోదు చేసి 2013లో ఎఫ్ఐఆర్ ను కోర్టులో సమర్పించారు. నిందితుల జాబితాలో అసాదుల్లా పేరు ఉంది. 2014లో కేసును ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు.
అప్పటి నుంచి అసాదుల్లా కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్ లో తలదాచుకున్న అసాదుల్లాను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మరింత సమాచారం సేకరించడానికి నిందితుడిని బెంగళూరు తీసుకు వచ్చారు.
ఇప్పటికే ఈ కేసులో విలేకరి, సైంటిస్ట్ తో పాటు 8 మందికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు ఎలాంటి ఆదారాలు కోర్టులో సమర్పించకపోవడంతో వారిని కేసు నుంచి విముక్తి చేశారు. ముగ్గరు బెయిల్ మీద విడుదల అయ్యారు. ఇప్పుడు అసాదుల్లా నుంచి మరింత సమాచారం సేకరించాలని అధికారులు బావిస్తున్నారు.












Click it and Unblock the Notifications