ఉగ్రదాడి: చైనా వైర్ లెస్ సెట్ సీజ్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. ఈ ఉగ్రదాడికి సంబంధించి అంగుళం కూడా వదిలిపెట్టకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శోధిస్తున్నారు.
పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఓ కొత్త ఆధారాన్ని సంపాధించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం సమీపంలో నిలిపి ఉన్న ఓ వాహనంలో చైనాకు చెందిన వైర్ లెస్ సెట్ ను ఎన్ ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చైనా వైర్ లెస్ సెట్ ను పరిశీలించేందుకు సీఎఫ్ఎస్ఎల్ కు పంపించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మరో పక్క ఈ కేసుకు సంబంధించి అనుమానంతో అదుపులోకి తీసుకున్న ఎస్పీ సల్వీందర్ సింగ్ ను వరుసగా మూడో రోజు విచారించారు.

ఎన్ఐఏ అధికారుల విచారణ
గురుదాస్ పూర్ లో ఎందుకు మీరు పదేపదే సంచరించారు అంటూ ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ సింగ్ ను ప్రశ్నించారు.

మార్చి మార్చి ప్రశ్నిస్తున్నారు
ఒక అంశంపై ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ సింగ్ ను మార్చి మార్చి ప్రశ్నిస్తున్నారు. సల్వీందర్ సింగ్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని అధికారులు అంటున్నారు.

అధికారుల అసంతృప్తి
సల్వీందర్ సింగ్ ఇస్తున్న సమాధానాలకు ఎన్ఐఏ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరన్నికోణాల్లో విచారణ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరన్ని కోణాల్లో సల్వీందర్ సింగ్ ను ప్రశ్నిస్తున్నారు.

వేళకాని వేళలో దర్గాకు
ఉగ్రదాడి జరిగిన రోజు రాత్రి సల్వీందర్ సింగ్ వేళకాని వేళలో పంజ్ పీర్ దర్గాను సందర్శించాడని అధికారులు గుర్తించారు.

నోటీసులు జారీ
సల్వీందర్ సింగ్ దర్గాను సందర్శించడంతో మరింత సమాచారన్ని సేకరించడానికి దర్గా సంరక్షకుడు సోమరాజ్ కు ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

గురువారం విచారణ
దర్గా సంరక్షకుడు సోమరాజ్ గురువారం ఢిల్లీలోని ఎన్ఐఏ అధికారుల ముందు విచారణకు హాజరైనారు.

లైడిటెక్టర్ పరిక్షలు
గురువారం సల్వీందర్ సింగ్ సరైన సమాచారం ఇవ్వకుంటే ఆయనకు లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహించాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు.

చైనా వైర్ లెస్ సెట్ కీలకం
చైనా వైర్ లెస్ సెట్ ను పరిశీలించి పూర్తి సమాచారం సేకరించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. చైనా వైర్ లెస్ సెట్ చిక్కిన వాహనాన్ని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications