reward: వీళ్ల ఆచూకి చెప్పండి, లక్షల్లో బహుమానం తీసుకోండి, అధికార పార్టీ దెబ్బతో ?, ఎంతకాలం !

బెంగళూరు/మంగళూరు/న్యూఢిల్లీ: అధికర పార్టీ నాయకుడు హత్యకు గురికావడంతో సొంత పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకుల మీద మండిపడుతున్నారు. సొంత పార్టీ నాయకుడి హత్య కేసును కొన్ని రోజులు స్థానిక పోలీసులు దర్యాప్తు చేసినా చివరికి ఆ కేసు విచారణ ఎన్ఐఏ చేతికి వెళ్లిపోయింది. అధికార పార్టీ నాయకుడి హత్య కేసులో చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ కేసులో నిందితులను పట్టించిన వారికి, వారి ఆచూకి చెప్పిన వారికి లక్షల్లో బహుమానం అందిస్తామని అధికారులు ప్రకటించారు. నిందితులను అరెస్టు చెయ్యడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ లీడర్ హత్య

బీజేపీ లీడర్ హత్య

బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు అలియాస్ ప్రవీణ్ హత్యకేసులో మరో ఇద్దరు నిందితుల ఆచూకీ కోసం జాతీయ దర్యాప్తు విభాగం ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులను పట్టించినా, వారి ఆచూకి తెలిపినా అక్షరాల రూ.5 లక్షలు ఇస్తామని అధికారులు ఆఫర్ చేశారు. ప్రవీణ్ హత్య కేసులో

ఇద్దరు నిషేధిత పీఎఫ్‌ఐ నేతలను గుర్తించిన వారికి రూ.5 లక్షలు బహుమానం ఇస్తామని ప్రకటించారు.

ఎన్ఐఏ ఎంట్రీతో సినిమా

ఎన్ఐఏ ఎంట్రీతో సినిమా

మంగళూరు సమీపంలోని బంట్వాళ తాలూకాలోని కొడాజెకు చెందిన పీఎఫ్‌ఐ కార్యవర్గ సభ్యుడు ముహమ్మద్ షరీఫ్, నెక్కిలాడికి చెందిన మసూద్‌లను ప్రవీణ్ హత్య కేసులో నిందితులుగా అధికారులు ప్రకటించారు. మోహమ్మద్ షరీఫ్, మసూద్ ల సమాచారం ఇచ్చేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రూ. 14 లక్షలు బహుమానం

రూ. 14 లక్షలు బహుమానం

మిగిలిన నలుగురు నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.14 లక్షల నగదు బహుమతిని ఎన్‌ఐఏ గతంలో ప్రకటించింది. పరారీలో ఉన్న నలుగురు ప్రధాన నిందితుల జాడ కోసం సమాచారం ఇస్తే 14 లక్షలు అందిస్తామని అధికారులు ప్రకటించారు. మహ్మద్ ముస్తఫా ఆచూకి చెబితే రూ 5 లక్షలు, తుఫైల్‌ ఆచూకి చెబితే రూ. 5 లక్షలు, ఉమర్ ఫరూక్‌ ఆచూకి చెబితే రూ. 2 లక్షలు బహుమతిగా అందిస్తామని అధికారులు ప్రకటించారు,

కిలాడీలు ఎక్కడ ఉన్నారు ?

కిలాడీలు ఎక్కడ ఉన్నారు ?

అబూబకర్ సిద్ధిక్‌ ఆచూకి చెబితే రూ. 2 లక్షలు ఇస్తామని అధికారులు తెలిపారు.

ముగ్గురు నిందితులు దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వారని, ఒకరు కొడగు జిల్లాకు చెందిన వాడని, మహమ్మద్ద్ ముస్తఫా దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలూకా బుడుమనే నివాసి అని. కొడగు జిల్లా మడికేరికి చెందిన తుఫైల్, దక్షిణ కన్నడ జిల్లాలో ఉమర్ ఫరూఖ్ నివాసం ఉంటున్నాడని, దక్షిణ కన్నడ జిల్లాలో అబూబకర్ సిద్ధిక్ నివాసం ఉంటున్నారని, వీరందరూ పీఎఫ్ఐ కార్యకర్తలు అని అధికారులు తెలిపారు. ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో నిందితులు అయిన వీరు జూలై 26న బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారును హత్య చేశారని, హత్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు సహకరించారని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+