2024లో విపక్షాల ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి ఖ‌రారు?

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను మోడీ-షా నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రాకూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రాంతీయ పార్టీలున్నాయి. ఇప్ప‌టికే ఎన్డీయే క్ర‌మేపీ బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తోంది. ఆ కూట‌మిలో చెప్పుకోద‌గ్గ పార్టీ లేకుండా పోయింది. అయినా సొంతంగా 272 సీట్లు సాధించ‌డంపైనే క‌మ‌ల ద‌ళం దృష్టిపెట్టి అంద‌క‌నుగుణంగా ప‌నిచేసుకుంటూ వెళుతోంది. తాజాగా విప‌క్షాల త‌ర‌ఫున ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి ఖ‌రార‌య్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

 సొంతంగా మెజారిటీ సాధించలేని స్థితికి కాంగ్రెస్

సొంతంగా మెజారిటీ సాధించలేని స్థితికి కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సొంతంగా 272 సీట్లు సాధించ‌గ‌లిగే ప‌రిస్థితి లేదు. రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం 'భార‌త్ జోడో యాత్ర' చేస్తున్నారు. సీనియ‌ర్లు ఒక్కొరొక్క‌రుగా పార్టీని వ‌దిలి వెళ్లిపోతున్నారు. దీంతో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌ను ఒక కూట‌మిగా ఏర్పాటు చేయ‌డానికి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ముందుకు వ‌స్తున్నారు. మ‌హారాష్ట్ర‌లో శ‌ర‌ద్‌ప‌వార్ ఎన్‌సీపీ, బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్‌, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌, ఢిల్లీలో ఆప్‌, త‌మిళ‌నాడులో డీఎంకే, ఏపీలో వైసీపీ, ఒడిసాలో బిజూ జ‌న‌తాద‌ళ్, ఉత్త‌ర‌ప్రదేశ్‌లో ఎస్పీ, బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ త‌దిత‌ర పార్టీల‌ను ఒకేగాట‌న క‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి.

నితీష్ కుమార్ తో రెండుగంటలకు పైగా చర్చలు

నితీష్ కుమార్ తో రెండుగంటలకు పైగా చర్చలు


ఈ బాధ్య‌త‌ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఇందులో భాగంగానే ఆయ‌న బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌ను క‌లిసి రెండుగంట‌ల‌కు పైగా చ‌ర్చించారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేత‌ర పార్టీల‌ను మార్చేస్తున్న తీరు, ఎమ్మెల్యేల కొనుగోలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఇదే విష‌య‌మై ప్ర‌శ్నించిన‌ప్పుడు నితీష్ కుమార్ పీకేనే అడ‌గ‌మ‌ని స‌మాధాన‌మిచ్చారు. త‌మ మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌న్నారు. జేడీయూ నుంచి పీకేను నితీష్ బహిష్కరించిన విషయం తెలిసిందే.

 మరికొందరిని కలవబోతున్న పీకే?

మరికొందరిని కలవబోతున్న పీకే?


నితీష్ కుమార్ త‌ర్వాత కూడా మ‌రికొంద‌రు నేత‌ల‌ను పీకే క‌ల‌వ‌బోతున్నారు. విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డంవ‌ల్లే ఎన్డీయే కూట‌మి వ‌రుస‌గా రెండుసార్లు అధికారంలోకి రాగ‌లిగింద‌ని, అలా కాకుండా ముందుగానే ప్ర‌ధాన‌మంత్రిగా నిజాయితీ ప‌రుడైన అభ్య‌ర్థిని ఎంపిక చేసుకొని ప్ర‌జ‌ల్లోకి ఆ పేరు చొచ్చుకెళ్లేలా చేయాల‌నేది ఆయ‌న వ్యూహంగా ఉంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా మోడీ కోసం పీకే అలాగే చేశారు. శరద్ పవార్ ను, నవీన్ పట్నాయక్ ను.. ఇతర నేతలను కూడా ఆయన కలబోతున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ లో కీలక పదవి కట్టబెడితే పనిచేస్తానని చెప్పినప్పటికీ రాహుల్ గాంధీ మొగ్గుచూపలేదు. దీంతో ఆయన ప్రాంతీయ పార్టీల కూటమివైపు మొగ్గుచూపారు. ఈ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రతిపాదిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వీటికి బలం చేకూరుస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి మ‌రి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+