గవర్నర్ ను గాలికి వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయిన విమానం, అసలు మ్యాటర్ !

బెంగళూరు: పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ కు వెళ్లాల్సిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను ఎయిర్ పోర్టులోనే వదిలేసి విమానం వెళ్లిన ఘటన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. జనవరి 27వ తేదీ గురువారం గవర్నర్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే 10 నిమిషాలు ఆలస్యంగా గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గవర్నర్ ఫ్లైట్ మిస్ అయ్యారు. పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ థావర్ చంద్ గెల్హాట్ ను వదిలేసిన విమానం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిపోయింది. గవర్నర్ అంటే ఓ రాష్ట్ర ప్రథమ పౌరుడు అనే విషయం విమాన సిబ్బంది మరచిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో తాను అగౌరవంగా భావిస్తున్నానని, నా విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘించబడిందని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

karnatakagoverner1
కేవలం10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని తనను వదిలేసి నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఏషియా ఎయిర్‌లైన్స్‌పై కర్ణాటక గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక గవర్నర్ బెంగళూరు నుంచి గురువారం హైదరాబాద్‌కు బయలుదేరారు. పది నిమిషాలు ఆలస్యంగా బెంగళూరు విమానాశ్రయానికి కర్ణాటక గవర్నర్ చేరుకున్నారు. ఇంతలో ఈ పొరపాటు జరిగింది. అనంతరం కర్ణాటక గవర్నర్ మరో విమానంలో హైదరాబాద్ వెళ్లారు.

గవర్నర్‌ను విడిచిపెట్టి ప్రోట్ కాల్ నియమాలు ఉల్లంఘించారని. మర్యాదలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్స్‌పై బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విమానం మిస్ కావడానికి కారణమేమిటని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ విషయంలో విచారణ కొనసాగే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+