నడిరోడ్డు మీద నమాజ్, సుమోటో కేసు పెట్టిన ఇన్స్ పెక్టర్ కు ఎలాంటి శిక్ష అంటే, బీజేపీ ఫైర్ !

కర్ణాటకలో మంగళూరులో మరోసారి హిందూ, ముస్లీంల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురు కావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని కంకనడిలో నడిరోడ్డుపై నమాజ్ చేసినందుకు సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ను బలవంతంగా సెలవు ఇచ్చి పంపించేశారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

అలాగే కేసుకు సంబంధించిన బి రిపోర్ట్ తయారు చేసి కేసును రద్దు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారని కన్నడ మీడియా తెలిపింది.మే 24వ తేదీన మంగళూరులోని కంకనాడి వద్ద రోడ్డుపై కొందరు ముస్లీంలు సామూహికంగా నమాజ్ చేశారు. ఈ మేరకు కద్రి పోలీసులు సుమోటో కేసు నమోదు చెయ్యడం తీవ్ర చర్చకు దారితీసింది.

The police officials who registered a case for offering namaz on the road have given leave to the inspector
ఐపీసీ సెక్షన్ 341, 283, 143, 149 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని కాంగ్రెస్ మైనారిటీ నాయకులు, ముస్లిం వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసుతో కొందరి పరువు పోవడంతో పోలీసుల విచారణకు ఏసీపీ స్థాయి అధికారిని నియమించారు.

రోడ్డుపైనే నమాజ్ చేసిన ఘటనపై స్పందించిన వీహెచ్‌పీ నేత శరణ్‌ పంప్‌వెల్‌పై మంగళూరు నగర్‌ సేన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.శుక్రవారం మళ్లీ రోడ్డుపై నమాజ్‌ చేస్తే మేము కూడా రోడ్ల మీదకు వచ్చి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పఠిస్తామని శరణ్‌ పంప్‌వెల్‌ హెచ్చరించారు.

ఇంకా మడికేరిలో మీడియాతో మాట్లాడిన కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ రోడ్డు మీద నమాజ్ చెయ్యడం చట్టవిరుద్ధమని నేను అనుకోవడం లేదని మంత్రి మధు బంగారప్ప అన్నారు.

The police officials who registered a case for offering namaz on the road have given leave to the inspector

నేను దీని గురించి పెద్దగా మాట్లాడను, అక్కడి పరిపాలనాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి మధు బంగారప్ప చెప్పడంతో ప్రజలు షాక్ అయ్యారు.రాయచూరులో మాజీ మంత్రి సిటి రవి మీడియాతో మాట్లాడుతూ మంగళూరులో మసీదులు ఖాళీగా పడి ఉన్నాయని, అక్కడ నమాజ్ చేసుకోకుండా రోడ్డుపైకి వచ్చి నమాజ్ చేస్తారా అని రోడ్డు మీద నమాజ్ చేసిన ముస్లీంను మాజీ మంత్రి సీటీ రవి ప్రశ్నించారు.

నమాజ్‌ చెయ్యడానికి వీళ్లు రోడ్డుపైకి రావడం లేదని, రోడ్డు మీద నమాజ్ చేస్తే వీళ్లు మనల్ని ఏం చేస్తారో చూద్దామని మమ్మల్ని పరీక్షిస్తున్నారని మాజీ మంత్రి సీటీ రవి ఆరోపించారు. రోడ్డుపై నమాజ్ చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వారి మీద చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సీటీ రవి డిమాండ్ చేశారు. నేరాలు చేసిన వారిని నేరస్తుల మాదిరిగానే చూడాలని, వారు రోడ్డు మీద నమాజ్ చేసి అల్లర్లు జరగడానికి కారణం అవుతున్నారని మాజీ మంత్రి సీటీ రవి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+