వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bengaluru: పార్క్ లో లవర్స్, ఏందిరా ఇలా చేస్తున్నారు లఫూట్, పేటీఎంలో లంచం తీసుకున్న పోలీస్ !

పార్క్ లో లవర్స్ ఉంటే పోలీసు అక్కడికి వెళ్లాడు. ఆ అమ్మాయితో ఎందుకు అలా ఉన్నావురా లఫూట్ అంటూ ప్రేమికులను బెదిరించాడు. ప్రేమికులను ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిత్తూరు: యువతి, యువకుడు పార్క్ కు వెళ్లారు. పార్క్ లో లవర్స్ తో పాటు చాలా మంది ఉన్నారు. అయితే పార్క్ లో ఓ మూల కుర్చున్న లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్బంలో ఖాకీ దుస్తులు వేసుకుని చేతిలో లాఠీ పెట్టుకుని అక్కడికి వెళ్లిన వ్యక్తి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. వెంటనే మొబైల్ ఫోన్ లో ప్రేమికులను పదేపదే ఫోటోలు తీశాడు. ఆ అమ్మాయితో ఎందుకు అలా ఉన్నావురా లఫూట్ అంటూ ఖాకీ దుస్తులు వేసుకున్న వ్యక్తి ప్రేమికులను బెదిరించాడు. ప్రేమికులను ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించాడు. మర్యాదగా పోలీస్ స్టేషన్ కు పదండి అంటూ హంగామా చేశాడు. క్లైమాక్స్ లో ప్రేమికుల నుంచి పేటీఎం ద్వారా లంచం తీసుకున్నాడు. ఖాకీ దుస్తుల్లో ఉన్న అతను పోతాపోతా ప్రియుడి బైక్ ఫోటో తీసుకుని రేయ్ మీరు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ప్రియుడి దెబ్బతో డీసీపీ ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరులో జంటలు కనపడితే పోలీసులు ఇలా లూటీలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Bengaluru: ఇది బెంగళూరులో పరిస్థితి, జంటను కారులో వెంబడించి. కారు కెమెరాలో చిక్కిపోయారు!Bengaluru: ఇది బెంగళూరులో పరిస్థితి, జంటను కారులో వెంబడించి. కారు కెమెరాలో చిక్కిపోయారు!

ప్రేమికుల నుంచి లంచం తీసుకున్న హోమ్ గార్డు

ప్రేమికుల నుంచి లంచం తీసుకున్న హోమ్ గార్డు

బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ స్టేషన్‌ పోలీసులు హోమ్ గార్డు మంజునాథ్ రెడ్డిని అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం తన స్నేహితుడితో కలిసి కుందనహళ్లి చెరువు సమీపంలోని పార్క్ లోకి వెళ్లిన సమయంలో నిందితుడు మంజునాథ్ రెడ్డి మమ్మల్ని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేశాడని లతీఫ్ అనే ప్రేమికుడు ట్విట్టర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హోమ్ గార్డు మంజునాథ్ రెడ్డిని అరెస్టు చేశామని వైట్‌ఫీల్డ్ డీసీపీ ఎస్. గిరీష్ మీడియాకు చెప్పారు.

ప్రియుడి ట్విటర్‌లో ఏం రాశాడు ?

ప్రియుడి ట్విటర్‌లో ఏం రాశాడు ?

నాకు బెంగళూరు పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. మాది వేరే రాష్ట్రం. నేను శనివారం నా స్నేహితురాలితో కలిసి మారతహళ్లి సమీపంలోని కుందనహళ్లి చెరువు సమీపంలోని పార్క్ ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటూ ప్రకృతి అందాలను చూస్తున్నాను. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బంది ఒక్కసారిగా మా ఫోటోలు తీసి వేధించడం మొదలుపెట్టారు. మీరు ఇక్కడ కూర్చోవడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు?, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని హోమ్ గార్డు మంజునాథ్ రెడ్డి మమ్మల్ని ప్రశ్నించాడని ప్రియుడు ట్విట్టర్ లో తెలిపారు.

మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు రా లఫూట్ ?

మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు రా లఫూట్ ?

మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు రా లఫూట్ ?

కొంతమంది ప్రజలు మా పక్కనే రాతి బెంచీలపై కూర్చున్నారు. కానీ ఆ హోమ్ గార్డు వారితో మాట్లాకుండా మమ్మల్ని మాత్రమే విచారించాడు. ఇక్కడ కుర్చుని ఏం చేస్తున్నారురా లఫూట్ అంటూ బూతులు తిట్టాడు. మీది ఏ ఊరు, ఏప్రాంతం, మీ ఇల్లు ఇక్కడ అని సవాలక్ష ప్రశ్నలు అడిగాడని ప్రియుడు లతీఫ్ ఆరోపించాడు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, మర్యాదగా మాతో పాటు మీరు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ పోలీసులు బెదిరించాడని ప్రియుడు లతీఫ్ ఆరోపించాడు.

పబ్లిక్ ప్లేస్ లో సిగరేట్ తాగావని కేసు పెడుతా

పబ్లిక్ ప్లేస్ లో సిగరేట్ తాగావని కేసు పెడుతా

మా అనుమతి లేకుండా ఇక్కడ కూర్చున్నందుకు, రొమాన్స్ చేసినందుకు జరిమానా చెల్లించాలని ఆ పోలీసు చెప్పాడని ప్రియుడు లతీఫ్ బెంగళూరు పోలీసులకు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు. మేము దూరందూరంగానే కుర్చున్నామని, మేము ఏ తప్పు చేశామని ప్రశ్నిస్తే రేయ్ నువ్వు మా అనుమతి లేకుండా కూర్చోవడమే కాకుండా సిగరెట్ తాగుతున్నావని కేసు పెడుతా అని బెదిరించాడని, ఈ మాటకు వస్తే మా దగ్గర సిగరెట్ లేదని, అక్కడే హాయిగా ప్రశాంతంగా కొంత సేపు కూర్చున్నాము అంతే అని చెప్పినా అతను పట్టించుకోకుండా మా మీద చిందులు వేశాడని ప్రియుడు లతీఫ్ ఆరోపించాడు.

మ్యాటర్ మీ ఇంట్లో తెలిసిపోతుంది తెలుసా ?

మ్యాటర్ మీ ఇంట్లో తెలిసిపోతుంది తెలుసా ?

అయినా ఆ పోలీసు మమ్మల్ని వదలకుండా మళ్లీమళ్లీ విచారణ కొనసాగించాడని, మీరు ఒకరిమీద ఒకరు కలిసి కూర్చున్నారన అంటూ నీచంగా మాట్లాడాడని, చివరికి స్టేషన్‌కి తీసుకెళ్తానని, అక్కడ సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ విషయం మీ కుటుంబ సభ్యులకు తెలిసిపోతుందని ఆ పోలీసు బెదిరించాడన బాధితుడు ఆరోపించాడు. అవన్నీ వద్దనుకుంటే ఇక్కడే సెటిల్ మెంట్ చేసుకోండి అని ఆ పోలీసు రాజీకి వచ్చాడని ప్రియుడు లతీఫ్ ట్విట్టర్ ద్వారా బెంగళూరు పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చాడు.

పేటీఎంలో లంచం తీసుకుని బుక్కైపోయాడు

పేటీఎంలో లంచం తీసుకుని బుక్కైపోయాడు

నేను తెలివైనవాడు కాబట్టి నాకు కొంచెం హిందీ తెలుసు, కానీ పోలీస్ స్టేషన్ లో ఉన్న నా పై అధికారికి కన్నడ బాష తప్పా మరే భాష రాదు, మీరు అక్కడికి వస్తే ఫినిష్ అయిపోతారు. అందుకే చెబుతున్నా ఇక్కడే లంచం ఇచ్చి వెళ్లిపోండి అని హోమ్ గార్డు మంజునాథ్ రెడ్డి ప్రేమికుల ముందు బేరం పెట్టారు. డబ్బులు లేవని చెప్పినా పట్టించుకోకుండా చివరకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, జోబులో డబ్బులు లేవు అంటే చివరికి పేటీఎం ద్వారా లంచం తీసుకున్నాడని ప్రియుడు లతీఫ్ ఆరోపించాడు. డబ్బులు తీసుకుని వెలుతున్న వ్యక్తి మళ్లీ తన బైక్ ఫోటోలు తీసి వార్నింగ్ ఇచ్చి వెళ్లాడని ప్రియుడు లతీఫ్ ట్విట్టర్ లో ఆరోపించాడు.

పార్క్ లో మగాళ్లు, ఆడవాళ్లు కలిసి కుర్చోకూడదా ?

పార్క్ లో మగాళ్లు, ఆడవాళ్లు కలిసి కుర్చోకూడదా ?

పురుషులు, మహిళలు కలిసి పార్క్ లో బహిరంగంగా కూర్చోలేరా? ఈ లింగవివక్ష ఎందుకు ? అని ప్రియుడు లతీఫ్ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారులను ట్విట్టర్ లో ప్రశ్నించాడు. మ్యాటర్ బెంగళూరు సిటీ పోలీసు అధికారులతో పాటు ప్రజలకు తెలిసిపోవడంతో పోలీసు అధికారులు సీరియర్ అయ్యారు. ఆ రోజు కుందనహళ్లి పార్క్ లో ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేసింది మంజునాథ్ రెడ్డి అని వెలుగు చూడటంతో అతన్ని సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీసీపీ గిరీష్ బుధవారం ఆయన్ను కలిసిన మీడియాకు చెప్పారు.

English summary
The policeman who threatened and tortured lovers in the park and collected bribe through Paytm in Bengaluru. What happened in the climax?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X