వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్ ...! రూ.1000 జరిమాన కట్టు.. ఉచిత హెల్మెట్ చేతపట్టు... !

|
Google Oneindia TeluguNews

టూ వీలర్ వినియోగదారులకు రాజస్థాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ట్రాఫిక్ రూల్స్‌లో బాగంగా పట్టుపడిన వాహనదారులకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది. ఇందులో బాగంగారు హెల్మెట్ లేకుండా పట్టుబడిన టూవీలర్ వినియోగాదారునికి కొత్త చట్టం ప్రకారం రూ.1000 ఫైన్ వేస్తూనే వారికి ఐఎస్ఐ మార్కు గల హెల్మెట్ ఉచితంగా పంపిణి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై రాజస్థానీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 కొత్త రూల్స్‌తో వాహనదారుల గుండెల్లో రైళ్లు

కొత్త రూల్స్‌తో వాహనదారుల గుండెల్లో రైళ్లు

ట్రాఫిక్ నిబంధనల కొత్త చట్టం వాహనదారుల గుండెల్లో రైల్లు పరుగెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు ఇప్పటికే వేల రూపాలయల జరిమానాలు వేస్తుండడంతో ప్రజల నుండి పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. దీంతో కేంద్రప్రభుత్వ అనుకూల ప్రభుత్వాలతోపాటు ఆదాయాన్ని పెంచుకోవాలనే రాష్ట్రాలు చట్టం అమలు కోసం కుస్తిలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ప్రభుత్వం వాహానదారుల నుండి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు చేపట్టింది. వాహానాదారులకు ఊరట నిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది.

చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన డిల్లీ హైకోర్టు...చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన డిల్లీ హైకోర్టు...

రూ.1000 ఫైన్‌తో పాటు ఫ్రీ హెల్మెట్

రూ.1000 ఫైన్‌తో పాటు ఫ్రీ హెల్మెట్

కేంద్రం తీసుకువచ్చిన చట్టంలో ఎక్కువ జరిమానాలు ఉండడంతో చాల రాష్ట్రాలు వీటిని అమలు చేసేందుకు ముందుకు రావడం లేదు.అయితే రాజస్థాన్ ప్రభుత్వం కూడ ఈ చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటీ ఇబ్బందులు ఉంటాయనే అంశంపై అధికారులతో చర్చిస్తోంది. ఇందులో బాగంగానే కొత్త చట్టం అమలుపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్ణయించారు. కొత్త చట్టం అమలు చేస్తూనే కొన్ని అంశాల్లో మాత్రమే భారీగా ఫైన్లు విధించాలని సూచించారు. దీంతో పాటు టూ వీలర్ వినియోగదారులకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకున్నారు. 1000 రుపాయాలు జరిమాన విధించిన అనంతరం వారికి ఐఎస్ఐ స్టాండర్డ్స్‌ ఉంటే హెల్మంట్‌ ఇవ్వాలని నిర్ణయింది. దీంతో బయట హెల్మెట్ కొనుగోలు చేసినా అదే 1000 రుపాయలు అవుతోంది. ఫైన్ కట్టినా పర్వాలేదు కొత్త హెల్మట్ వస్తుందనే దీమాతో టూ వీలర్ దారులు ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేంద్రం కూడ ఆలోంచించాలని ప్రభుత్వం కోరుతోంది.

 అమలు చేయని పలు రాష్ట్రాలు

అమలు చేయని పలు రాష్ట్రాలు


రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదాలు, మరణాల నియంత్ర కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారువాహానాల చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ సవరణ బిల్లు సెప్టెంబర్ ఒకటి నుండి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఇందుకోసం కేంద్రం నోటిఫికేషన్ కూడ విడుదల చేసింది. అయితే ఈ చట్టం అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద అధారపడి ఉంటుంది. ఈనేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్య ప్రదేశ్,ప్రభుత్వాలు జరిమానాలు అధికంగా ఉన్నాయంటూఈ చట్టాన్ని అమలు పరించేదుకు నిరాకరించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టంపై చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే రాజస్థాన్ ప్రభుత్వం చట్టంలో ఉన్న అధిక జరిమానలపై చర్చించడంతో పాటు వాహనాదారుల ఆగ్రహానికి గురికాకుండా పలు సమీక్ష జరిపి ఈ నిర్ణయం తీసుకుంది.

English summary
The Rajasthan government is planning to give free ISI marked helmets with a challan of Rs 1,000 to those who are caught driving without helmets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X