బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అధికార పార్టీ అంటే ఆ పార్టీ నాయకులకు చాలా గౌరవం ఎక్కువ. అధికార పార్టీ నాయకులతో పెట్టుకుంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం చాలా మందికి ఉంటుంది. ఇక్క ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అయితే అధిక పార్టీ నాయకులకు సలామ్ లు కొడుతకుంటారని కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే పోలీస్ స్టేషన్ లో రెచ్చిపోయి ఏకంగా సర్కిల్ ఇన్సె పెక్టర్ కాలర్ పట్టుకుని దాడి చెయ్యడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నాయకుడికి పోలీసులు సినిమా చూపించారు. నువ్వు ఎవడైతే మాకేమిటి అంటూ పోలీసులు రెచ్చిపోవడంతో ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉన్నా సత్తాచాటుకేకపోయిన అధికార పార్టీ నాయకుడు బిత్తరపోయాడని తెలిసింది.

Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే ?Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే ?

ఎక్కడో తేడా వచ్చింది

ఎక్కడో తేడా వచ్చింది

అధికార పార్టీ నాయకుల వెంట ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే అధికార పార్టీ నాయకుడు, మాజీ కార్పోరేటర్ కు పోలీసులు సినిమా చూపించారు. ఓ కేసు విషయంలో మాట్లాడటానికి వెళ్లిన అధికార పార్టీ నాయకుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనకు సినిమా చూపించారు. చాలాకాలం నుంచి పోలీసు అధికారికి, అధికార పార్టీ నాయకుడి మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఇంత జరిగిందని తెలిసింది.

మాజీ కార్పోరేటర్

మాజీ కార్పోరేటర్

విధి నిర్వహణలో ఉన్న సీఐ ( సర్కిల్ ఇన్స్ పెక్టర్) మీద దాడి చేసిన ఆరోపణలపై బెంగళూరులోని బీజేపీ మాజీ కార్పొరేటర్ వి.బాలకృష్ణను కగ్గలిపర పోలీసులు అరెస్ట్ చెయ్యడం కలకలం రేపింది. బెంగళూరులోని బీబీఎంపీ వార్డ్ నంబర్ 185 యెలచేనహళ్లి వార్డు మాజీ కార్పొరేటర్ బాలకృష్ణ గురువారం రాత్రి ఓ భూవివాదం విషయంలో మాట్లాడేందుకు కగ్గలిపుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

సీఐ కాలర్ పట్టుకుని ?

సీఐ కాలర్ పట్టుకుని ?

అదే సమయంలో కగ్గలిపురం పోలీస్ స్టేసన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్‌తో బీజేపీ నాయకుడు బాలక్రిష్ణల మద్య మాటామాటా పెరిగిపోవడంతో వాగ్వివాదం జరగింది. ఆ సమయంలో అధికార పార్టీ నాయకుడు బాలకృష్ణ సీఐ విజయ్ కుమార్ మెడ పట్టి లాగాడని, ఆయన కాలర్ పట్టుకుని దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

సీన్ రివర్స్ తో షాక్

సీన్ రివర్స్ తో షాక్

పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని కగ్గలిపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ పోలీసు అధికారిపై దాడి చేశారని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ ల కింద అధికార పార్టీ నాయకుడు బాలక్రిష్ణ మీద పోలీసులు కేసు నమోదు చెయ్యడం కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు అధికార పార్టీ నాయకుడికి వైద్యపరీక్షలు నిర్వహించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఏం జరుగుతోంది ?

ఏం జరుగుతోంది ?

సీఐ విజయ్ కుమార్ మీద దాడి చేసిన మాజీ కార్పోరేటర్ బాలక్రిష్ణను కోర్టులో హాజరుపరచనున్నారు. తరువాత విచారణ నిమిత్తం మాజీ కార్పొరేటర్ బాలకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీ నాయకుడు కావడంతో ఆ పార్టీ పెద్దలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. అధికార పార్టీ నాయకులు మీద వరుసగా కేసులు నమోదు కావడంతో అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిందని తెలిసింది.

English summary
The ruling party leader Balakrishna, who grabbed the police officer by the collar, was arrested and produced before the court by the police officers in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X