ఢిల్లీలో డీజిల్ కార్లను నిషేధిస్తారా?
న్యూఢిల్లీ: కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని కాపాడటానికి ఒక్కో ప్రయత్నం ముందుకు వెళుతున్నది. ఢిల్లీ నగరంలో కాలుష్యానికి ఎక్కువ కారణం అవుతున్న డీజిల్ కార్లను నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది.
గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. పిటిషన్ ను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని, మంగళవారం తమ నిర్ణయం ప్రకటిస్తామని ధర్మాసనం తెలిపింది.

డీజిల్ కార్లను ఢిల్లీ నగర వీధుల్లోకి రాకుండా పూర్తిగా బహిష్కరిస్తారా, లేదా పరిమితులు విధిస్తే సరిపోతుందా అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పనుంది. మరో పక్క కాలుష్యాన్ని నివారించడానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా సుప్రీం కోర్టు స్పందించింది.
ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి తెస్తున్న సరి-భేసి పాలసీపై స్పందించింది. ఏదో ఒక పరిష్కారంతో సమస్య మొత్తం అంతం కాదని, బహుళ కార్యక్రమాలును తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే భారీ ట్రక్కులు ఢిల్లీ నగరంలో తిరగకుండా నిషేధించే అవకాశం ఉందని న్యాయనిపుణలు అంటున్నారు.












Click it and Unblock the Notifications