Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు చేరుకున్న రెండో విమానం..

ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించడానికి రెండవ చార్టర్ ఫ్లైట్ 'ఆపరేషన్ అజయ్' కింద శనివారం ఉదయం టెల్ అవీవ్ నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. రెండో విమానంలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 235 మంది భారతీయులు వచ్చారు. ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం తీవ్రస్థాయి చేరుకోవడంతో అక్కడున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది.

ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి పసిపాపతో సహా 212 మంది భారతీయ ప్రయాణికులతో విమానం శుక్రవారం ఉదయం భారత్ కు చేరుకుంది. శుక్ర, శనివారాల్లో మొత్తం 247 ఇండియాకు చేరుకున్నారు. రెండో విమానానికి సంబంధించిన ఫొటోలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. "#OperationAjay Flight #2 235 మంది భారతీయ పౌరులను తీసుకువెళుతున్న టెల్ అవీవ్ నుంచి బయలుదేరింది" అని ట్వీట్ చేశారు.

The second flight from Israel reached India as part of Operation Ajay
అక్టోబర్ 11 న 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది భారత ప్రభుత్వం. అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమైనందున ఎయిర్ ఇండియా, ఇతర విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌కు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో భారత ప్రభుత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద ప్రత్యేక చార్టర్డ్ విమానాలు భారతీయులను తిరిగి తీసుకువస్తున్నాయి. MEA కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది.

ఇజ్రాయెల్, పాలస్తీనాలో పరిస్థితిని పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ రాజధానిలో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ కోసం ఫోన్ నంబర్‌లు: 1800118797 (టోల్ ఫ్రీ), +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905, +919968291988, ఇమెయిల్ ID [email protected] గా ఉంది. భారత రాయబార కార్యాలయం 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ను - +972-35226748, +972-543278392, ఇమెయిల్ ID [email protected] మెయిల్ చేయవచ్చు.


ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రస్థాయి యుద్ధం శనివారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ అపూర్వమైన ఆకస్మిక దాడిని ప్రారంభించినప్పటి నుండి రెండు వైపులా కనీసం 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని ఒక మిలియన్ మందికి పైగా ప్రజలను దక్షిణం వైపుకు వెళ్లనున్నారు. UN ప్రకారం, ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఖాళీ చేయమని 24 గంటల నోటీసు ఇచ్చిన తర్వాత గాజాలోని పదివేల మంది దక్షిణం వైపుకు పారిపోయారని అంచనా. అంతకుముందు, శత్రుత్వాల కారణంగా 400,000 మందికి పైగా పాలస్తీనియన్లు అంతర్గతంగా నిర్వాసితులయ్యారని UN తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+