మాజీ సీఎం యడియూరప్ప కేసులో సీఎం సిద్దరామయ్య సంచలన నిర్ణయం, వాళ్ల చేతికి కేసు !
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. మాజీ సీఎం యడియూరప్పపై నమోదు అయిన ఫోక్స్ కేసును సీఐడీ విచారణకు సిద్దరామయ్య ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై బెంగళూరులో కేసు నమోదైంది. ఈ మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మాజీ సీఎం యడ్యూరప్పపై కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తామని కర్ణాటక డీఐజీ అలోక్ మోహన్ శుక్రవారం తెలిపారు.

ఈ కేసుపై మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని తల్లీ, కూతుళ్లు చాలాసార్లు తన ఇంటికి వచ్చారని అన్నారు. మాకు అన్యాయం జరిగిందని, మీరే న్యాయం చెయ్యాలని తన దగ్గరకు వచ్చారని, వారికి న్యాయం చేయాలని తాను అనుకున్నానని, తరువాత వాళ్లకు కొంత డబ్బు ఇచ్చానని, ఇప్పుడు వాళ్లు తనకు వ్యతిరేకంగా కేసు పెట్టి ఏదో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
బాధితులకు న్యాయం చెయ్యాలని ఉద్దేశంతో తాను వారిని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ దగ్గరకు పంపించానని, తరువాత వాళ్లు తన మీదే కేసు పెట్టారని యడియూరప్ప ఆరోపించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనది కాదని, దీనిపై న్యాయపరంగా తాము ముందుకు వెలుతామని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడ్యూరప్ప అన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రెండుమూడు రోజుల్లో విడుదల అవుతున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కర్ణాటకను కుదిపేసింది.












Click it and Unblock the Notifications