బీజేపీకి రివర్స్ గేర్ వేస్తున్న సిద్దరామయ్య ప్రభుత్వం, అవినీతి మొత్తం బయటకు లాగి ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పుడే ప్రతీకార రాజకీయాలకు బీజం పడిందని వెలుగు చూసింది. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి మొత్తం బయటకులాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్దం అయ్యిందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
డీకే శివకుమార్ ను ఓడించాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో 1. 20 లక్షల ఓట్లు సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం పదవి కోసం చివరికి నిమిషం వరకు పోటీ పడిన డీకే శివకుమార్ చివరికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి రాజీకీ అయ్యారు.

గత మూడు సంవత్సరాలుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీజేపీ 40 శాతం ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల మధ్యలోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ చివరికి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో సక్సస్ అయ్యింది.
ఇప్పుడు ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల విషయంలో విచారణ జరిపించాలని, ఎవరి దగ్గర ఎంతెంత కమీషన్ తీసుకున్నారు అని పూర్తి మ్యాటర్ బయటకు లాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది. బీజేపీ అవినీతి మొత్తం బయటకు లాగడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అయ్యిందని తెలిసింది.

రెండు సంవత్సరాల నుం0చి డీకే శివకుమార్ ను సీబీఐ అధికారులు, ఈడీ, ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్ ను ఓ సారి జైలుకు పంపించిన అధికారులు ఇప్పుడు ఆయన్ను విచారణ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటలోని బీజేపీ నాయకులు అవినీతి మొత్తం బయటకు లాగి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు బావిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications