Viral Video: డబ్బులు లేక తల్లి శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన కొడకు..
దేశంలో చాలా మంది పేదరికంలో ఉన్నారు. కనీసం చనిపోతే శవాన్ని తీసుకుపోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వమే చేయూత ఇవ్వాలని కానీ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కొడకు శవం తీసుకెళ్లడానికి డబ్బులు లేక తండ్రి పడిన ఆవేదన ప్రజలను కదిలించింది.
80 కిలోమీటర్ల దూరం
తాజాగా మధ్యప్రదేశ్ షాహ్‌దోల్ జిల్లాలోని ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందింది. అయితే తల్లిని అంబులెన్స్ తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్న కొడకు తల్లి మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌కు కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెక్క పలకలపై
ఇద్దరు పురుషులు తమ తల్లి చికిత్స కోసం అనుప్పూర్ జిల్లా నుంచి షాడోల్ మెడికల్ కాలేజీకి వచ్చారు. సరైన వైద్యం అందకపోవడంతోనే తమ తల్లి చనిపోయిందని, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో వాహన సదుపాయం కూడా లేదని వాపోతున్నారు. కొడుకులు రూ. 100కి చెక్క పలకను కొని, దానితో తల్లి మృతదేహాన్ని కట్టి, అనుప్పూర్ జిల్లాలోని తమ గ్రామమైన గూడారుకు 80 కిలోమీటర్లు ప్రయాణించారు.

ఆసుపత్రి యాజమాన్యమే కారణం
అనుపూర్‌లోని గోదారు గ్రామానికి చెందిన జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ జిల్లా ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వైద్య కళాశాలకు తరలించగా చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందింది. జిల్లా ఆసుపత్రి నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తన తల్లి మృతికి మెడికల్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని రోగి కుమారుడు సుందర్ యాదవ్ ఆరోపించారు.

ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు
మహిళ మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు తాము వాహనం కావాలని విజ్ఞప్తి చేస్తే వారు వాహనం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ మధ్యే మధ్యప్రదేశ్ లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేశారు.












Click it and Unblock the Notifications