మాంసం దుకాణాలపై నిషేధంలో తప్పేముంది.. కచ్చితంగా అమలు చేస్తామన్న దక్షిణ ఢిల్లీ నగర మేయర్
నవరాత్రుల సందర్భంగా దక్షిణ ఢిల్లీ నగరంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మాంసం దుకాణాలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా నవరాత్రుల సందర్భంగా దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలను మూసి వేయడం తొలిసారి జరిగింది. అయితే దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలపై నిషేధం కచ్చితంగా అమలవుతుంది: దక్షిణ ఢిల్లీ మేయర్
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు హిందువుల పండుగ అయిన నవరాత్రి సందర్భంగా దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలపై నిషేధం కచ్చితంగా అమలు చేయబడుతుంది అని, ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నామని, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించలేదని మేయర్ ముఖేష్ సూర్యన్ తెలిపారు.తాము అన్ని మాంసం దుకాణాలను ఖచ్చితంగా మూసివేస్తామని , మాంసం విక్రయించనప్పుడు, ప్రజలు దానిని తినరు అని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెల్లడించారు.

తము తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదన్న మేయర్
రంజాన్ ఉపవాస మాసంలో కొన్ని ఇస్లామిక్ దేశాలలో బహిరంగంగా నీరు త్రాగడం నిషేధించబడిన ఆదేశాన్ని ఆయన సమర్థించారు. ఢిల్లీవాసుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజలు తనకు ఫిర్యాదు చేశారని, బహిరంగంగా మాంసం కోయడం వల్ల ఉపవాసం ఉన్నవారు సమస్యలను ఎదుర్కొంటున్నారని మేయర్ తెలిపారు. ఇది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించదు అని మేయర్ ముఖేష్ సూర్యన్ అన్నారు.

నవరాత్రుల 9 రోజులు మాంసం దుకాణాలు మూసివేత నిర్ణయం
తాము మాంసం నిషేధ నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటిస్తామని, ఏప్రిల్ 8, 9, 10 తేదీలలో, మేము అన్ని కబేళాలను కూడా మూసివేస్తామని ఆయన వెల్లడించారు. దుర్గాదేవికి ఇష్టమైన నవరాత్రుల పవిత్రమైన కాలం సందర్భంగా నగరపాలక సంస్థ లోని మాంసం దుకాణాలను మూసివేయాలని దక్షిణ ఢిల్లీ మేయర్ సోమవారం ప్రకటించారు. ఈ తొమ్మిది రోజులలో భక్తులు మాంసం తినకూడదని తెలిపారు.

నవరాత్రుల కోసం చేస్తే తప్పేముంది .. ప్రశ్నించిన మేయర్
తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఈ పండుగ సందర్భంగా మాంసం దుకాణాలను మూసివేయడం మాకు సంతోషాన్నిస్తుంది అని అన్నారు. ఇందులో ఎలాంటి సమస్య లేదని, ఎటువంటి తప్పు లేదని, కేవలం నవరాత్రుల కోసం మాంసం దుకాణాలపై నిషేధం విధించామని చెప్పారు. దీనిపై తాము ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకున్నామంటూ వెల్లడించారు.

మాంసం దుకాణాల వల్ల దుర్వాసన.. అందుకే ఈ నిర్ణయం
దుర్గాదేవి రోజువారీ ప్రార్థనలు చేసేటప్పుడు మాంసం దుకాణాలు వల్ల దుర్వాసన వస్తుందని, దీనివల్ల భక్తుల మతవిశ్వాసాలు, మనోభావాలు ప్రభావితం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే సామాన్య ప్రజల మనో భావాలను దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్ 2, 2022 నుండి ఏప్రిల్ 11 వరకు విస్తరించి ఉన్న నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజుల వ్యవధిలో మాంసం దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ నగరంలో పదిహేను వందల దాకా నమోదిత మాంసం దుకాణాలు ఉన్నట్టుగా సమాచారం.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications