Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టార్గెట్ 2024 - సీడబ్ల్యూసీ కూర్పుపై నిర్ణయం : కాంగ్రెస్ మేధో మథనం..!!

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ మేధోమథనానికి సిద్దమైంది.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కీలక అడుగులు వేయనుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్దం చేసేందుకు సిద్దం అవుతోంది. నేటి నుంచి రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లనరీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే తొమ్మది రాష్ట్రాల ఎన్నికలు..వివిధ రాష్ట్రాల్లో పొత్తులను ఎలా పటిష్ఠం చేసుకోవాలన్న అంశాలపై కాంగ్రెస్‌ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర పార్టీకి ఇచ్చిన ఊపుతో కొత్త నిర్ణయాల దిశగా పార్టీ సిద్దం అవుతోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ మేధోమథనం లో తీసుకొనే నిర్ణయాలు కీలకం కానున్నాయి.

సీడబ్ల్యూసీ కూర్పు పై నిర్ణయం..

సీడబ్ల్యూసీ కూర్పు పై నిర్ణయం..

ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిరంలో తీసుకున్న పలు నిర్ణయాలకు రాయ్‌పూర్‌ ప్లీనరీ ఆమోద ముద్ర వేయనుంది. ఈ ప్లీనరీ పార్టీ పునరుత్థానానికి జరిగే చరిత్రాత్మక మలుపుగా కాంగ్రెస్‌ భావిస్తోంది. తొమ్మది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్లీనరీ ముందే పార్టీ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ తోనే బలమైన ప్రతిపక్షం ఏర్పడుతుందని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి. పార్టీలో దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, యువకులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలుగా పార్టీ రాజ్యాంగంలో మార్పులపై కూడా ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీడబ్ల్యూసీతో పాటు ఇతర కమిటీల్లో అణగారిన వర్గాలకు స్థానం కల్పించడం ద్వారా పార్టీ సామాజిక రూపురేఖలు మార్చాలని నేతలు భావిస్తున్నారు. ఇక పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

స్టీరింగ్ కమిటీలో ఆమోద ముద్ర

స్టీరింగ్ కమిటీలో ఆమోద ముద్ర

ప్లీనరీ తొలి రోజు ముసాయిదా తీర్మానాలను చర్చించి స్టీరింగ్‌ కమిటీలో ఆమోద ముద్ర వేస్తారు. వీటిపై శనివారం విస్తృత చర్చలు జరుగుతాయి. ఆదివారం దాదాపు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ రూపొందించేందుకు ప్లీనరీలో కీలక చర్చలు జరుపనున్నారు. కాంగ్రెస్ తోనే బలమైన ప్రతిపక్షం ఏర్పడుతుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో 350-400 సీట్లలో మాత్రమే పోటీ చేయాలని, 150-200 సీట్లను మిత్రపక్షాలకు వ్యూహాత్మకంగా వదిలివేయాలన్న అంశంపై కూడా ప్లీనరీలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల పాటు ప్లీనరీ జరగనుంది. దాదాపు 15 వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పార్టీలో దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, యువకులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలుగా పార్టీ రాజ్యాంగంలో మార్పులపై కూడా ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీడబ్ల్యూసీతో పాటు ఇతర కమిటీల్లో అణగారిన వర్గాలకు స్థానం కల్పించడం ద్వారా పార్టీ సామాజిక రూపురేఖలు ఇవ్వాలనే ప్రతిపాదనల పైన ఈ ప్లీనరీలో నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

రాహుల్ మరో యాత్రపై చర్చ..

రాహుల్ మరో యాత్రపై చర్చ..

భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందనతో పార్టీకి మంచి జోష్ వచ్చిందని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ మరో యాత్రకు సంబంధించి చర్చ సాగుతోంది.పశ్చిమం నుంచి తూర్పునకు రాహుల్ గాంధీ మరో యాత్ర గురించి చర్చించి..వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లటం పైన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. టీఎంసీ, బీఆర్ఎస్, ఆప్ పార్టీలు జాతీయ పార్టీలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వేళ కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక.. ఈ ప్లీనరీలో సీడబ్ల్యూసీ ఎన్నికల పైన తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. చివరిసారిగా 1977లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి తొలి రోజునే నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. ఇక..మూడు రోజుల మేధో మధనం ద్వారా కాంగ్రెస్ టార్గెట్ 2024 పేరుతో కొత్త కార్యాచరణ ప్రకటించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+