మీ కంటికి ఇప్పుడే కనపడిందా: హైకోర్టు

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)లో అవినీతి జరుగుతున్నదని మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా, కమీషనర్ ను మీరే నియమించారు కదా అంటూ కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది. మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యిందని గుర్తు చేశారు.

కొద్ది రోజులలో బీబీఎంపీ ఎన్నికలు జరగవలసి ఉన్న సమయంలో మీరు ఎందుకు సూపర్ సీడ్ చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బీబీఎంపీ ఎన్నికలు అనుకున్న విధంగానే గడువులోపు జరపాలని కర్ణాటక హై కోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

The State government requested a division bench of the Karnataka High Court

బెంగళూరును విభజిస్తున్నామని, అందుకు తమకు సమయం కావాలని ప్రభుత్వం హై కోర్టులో అర్జీ సమర్పించింది. బుధవారం హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్, వఘేలా, రామమోహనరెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ అర్జీ విచారణ చేసింది.

ఆ సమయంలో బీబీఎంపీని ప్రభుత్వం సూపర్ సీడ్ చేసిందని, ఎన్నికలు నిర్వహించడానికి ఆరు నెలల సమయం ఉందని అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ కోర్టు ముందు చెప్పారు. ఆ సందర్బంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హై కోర్టు మండిపడింది. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వులో పెట్టారు. ఈ నెల 24వ తేదిన కేసు విచారణ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+