డీకేశికి బిగ్ రిలీఫ్, హైకోర్టులో జోక్యం చేసుకోలేమని తేల్చిన సుప్రీం !
బెంగళూరు: అవినీతి విచారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మరోసారి ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఆర్డర్‌పై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. డీకే శివకుమార్‌పై సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు గతంలో మధ్యంతర స్టే విధించింది. దర్యాప్తు స్టే ఆర్డర్‌ను రద్దు చేయాలని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.
డీకే శివకుమార్ మీద సీబీఐ విచారణకు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం కొట్టివేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి ఊరటనిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు అధికారును నిరాశకు గురి చేసింది. అంతే కాకుండా సీబీఐ అధికారుల అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. కొట్టివేసింది.

2013 నుంచి 2018 వరకు డీకే శివకుమార్ ఆదాయంపై సీబీఐ విచారణ చేపట్టింది. డీకే. శివకుమార్ మీద నమోదు అయిన సీబీఐ విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని ఇటీవల కర్ణాటక హైకోర్టు మధ్యంత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరిగింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
డీకే శివకుమార్ ఆదాయానికి మంచి ఆస్తులు సంపాదించారనే ఆరోపలు రావడంతో గతంలోని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. అప్పటి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ డీకే శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. దానిని ప్రశ్నిస్తూ డీకే. శివకుమార్ మరోసారి అప్పీల్ చేశారు. దీంతో హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను స్వీకరించి సీబీఐ దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత డీకే శివకుమార్‌కు మరోసారి ఊరట లభించింది.












Click it and Unblock the Notifications