వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల అర్జీ: సుప్రీం కోర్టు అక్షింతలు, మీకు టైం లేదా, మీ ఇష్టమా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక రెబల్ MLAకు సుప్రీం అక్షింతలు|Supreme Court Agreed2 Independent MLAs To Take Back Their Plea

న్యూఢిల్లీ: కర్ణాటక శాసన సభలో కుమారస్వామి వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని మనవి చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన స్వతంత్ర పార్టీల రెబల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. విచారణకు రావడానికి మీకు టైం లేదా, అంతా మీ ఇష్టమా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్వతంత్ర పార్టీల రెబల్ ఎమ్మెల్యేలు వేసిన అర్జీని వెనక్కి తీసుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

మీరు అర్దరాత్రి వచ్చి అర్జీలు విచారించాలని అడితే మేము వినాలి, మేము చెప్పిన సమయానికి మీరు రావడానికి వీలు ఉండదా ? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సోమవారం శాసన సభలో కుమారస్వామి అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలు ఆర్. శంకర్, నాగేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

The Supreme Court has agreed two independent MLAs to take back their plea on floor-test.

స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలు నాగేష్, శంకర్ లు వేసిన అర్జీని సోమవారం సుప్రీం కోర్టు పరిశీలించి మంగళవారం విచారణ చేస్తామని చెప్పింది. మంగళవారం కుమారస్వామి అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చామని, కచ్చితంగా ఆ రోజు ఆ పని పూర్తి చేస్తామని స్పీకర్ రమేష్ కుమార్ సుప్రీం కోర్టుకు తెలిపారు.

స్పీకర్ ఒక్క రోజు అవకాశం కోరడంతో సుప్రీం కోర్టు అర్జీ విచారణ వాయిదా వేసింది. మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన కుమారస్వామి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. తాము వేసిన అర్జీని వెనక్కి తీసుకుంటామని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

బుథవారం సుప్రీం కోర్టులో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ జరిగిన సమయంలో వారి తరపు న్యాయవాది ముకుల్ రోహటగి హాజరుకాలేదు. ఆ సమయంలో సుప్రీం కోర్టు రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగికి అక్షింతలు వేసింది.

మీకు అవసరం అయితే అర్దరాత్రి వచ్చి అర్జీ సమర్పించి విచారణ చెయ్యాలని మనవి చేస్తే మేము అవకాశం ఇవ్వాలి, అయితే మీరు సమర్పించిన అర్జీని వెనక్కి తీసుకోవడానికి రావడానికి మాత్రం సమయం ఉండదా ? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించి చివాట్లు పెట్టింది. రెబల్ ఎమ్మెల్యేల మనవి మేరకు వారు సమర్పించిన అర్జీ వెనక్కి తీసుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

English summary
Karnataka political crisis: The Supreme Court has agreed two independent MLAs to take back their plea on floor-test. The court expressed displeasure on advocate Mukul Rohatgi for not attending yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X