నేతల కులమతాల ప్రసంగాలు..! ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ : సున్నితమైన కులమతాల అంశాన్ని అడ్డుపెట్టుకుని.. అడ్డదిడ్డంగా ప్రసంగాలు చేసే లీడర్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆ రోజుకు వాయిదా వేసింది.
రాజకీయ పార్టీలకు చెందిన వివిధ స్థాయి నేతలు, అధికార ప్రతినిధులే టార్గెట్ గా.. షార్జాలో నివసించే హర్ప్రీత్ మన్సుఖనీ అనే ఎన్నారై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వారు కులమతాల గురించి ప్రసంగించినా, ఆరోపణలు చేసినా.. కఠిన చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అంతేకాదు కులమతాల ప్రాతిపదికన డిబేట్లు పెట్టే మీడియా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

హర్ప్రీత్ మన్సుఖనీ పిటిషన్ కు సంబంధించి.. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్దే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం ఈ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications