Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Suprem Court: బల్వంత్ సింగ్ రాజోనా మరణశిక్షను తగ్గించలేము.. స్పష్టం చేసిన సుప్రీం కోర్టు..

1995లో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలిన బల్వంత్ సింగ్ రాజోనా మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌పై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. బల్వంత్ సింగ్ రాజోనా గత 26 ఏళ్లుగా జైలులో ఉంటున్నారు.

సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఆగస్ట్ 31, 1995లో చండీగఢ్‌ లోని సచివాలయం ముందు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో అప్పటి పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌ సింగ్‌ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

 balwantsinghrajona-

తన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలన రాజోనా కేంద్రానికి 2012 విజ్ఞప్తి చేశాడు. దీని ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజోనా తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. క్షమాభిక్ష పిటిషన్‌పై ఇంత కాలం నిర్ణయం తీసుకోకపోవడం, మరణశిక్ష విధించడం అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించిందని వాదించారు. ఆయన క్షమాభిక్ష అభ్యర్థన దశాబ్ద కాలంగా ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉందని గుర్తు చేసారు.

రాజోనా పిటిషన్‌ను విచారించేందుకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది అక్టోబర్ 11న అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసును మగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించగా.. తన క్లయింట్ 26 ఏళ్లుగా జైలులో ఉన్నాడని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవిత రక్షణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) మానవ హక్కులు ఉల్లంఘించినట్లేనని రోహత్గీ చెప్పారు. రాజోవానా దీర్ఘకాలంగా జైలులో ఉన్న కారణంగా తన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరారు.

ప్రభుత్వం తరుఫున్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదానలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం మార్చి 2న రాజోనా పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును బుధవారం వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష, సస్పెండ్, ఉపసంహరణ లేదా కొన్ని సందర్భాల్లో శిక్షలను మార్చే అధికారాలకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు రాష్ట్రపతికి ఎప్పుడు పంపుతారో తెలియజేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+