బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాసేపట్లో శశికళ అరెస్టు ? 6 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా, ఏం చెద్దాం!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించిన శశికళను అరెస్టు చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం (ఈ రోజు ఫిబ్రవరి 14) 6 గంటల తరువాత ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తమిళనాడు పోలీసు వర్గాలు అంటున్నాయి.

<strong>పన్నీర్ కు పప్పు చారు, చిన్నమ్మకు చిప్పకూడు: సెల్వం గూటికి ఎమ్మెల్యేలు</strong>పన్నీర్ కు పప్పు చారు, చిన్నమ్మకు చిప్పకూడు: సెల్వం గూటికి ఎమ్మెల్యేలు

మంగళవారం కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ కాలం గడిపారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారు. గోల్డెన్ బే రిసార్ట్ ను పోలీసులు ఇప్పటికే చుట్టుముట్టారు. మంగళవారం శశికళను అరెస్టు చేసి బుధవారం ఆమెను బెంగళూరు పోలీసులకు అప్పగించాల్సి ఉంది.

The Supreme Court sends Sasikala to 4-year jail in DA case

శశికళను ఎప్పుడు అరెస్టు చెయ్యాలి, ఎలా తరలించాలి అంటూ తమిళనాడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే అనారోగ్యం కారణంగా తాను కోర్టులో లొంగిపోయేందుకు సమయం కావాలని శశికళ కోరే అవకాశం ఉందని సమాచారం.

<strong>చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన రాఘవ లారెన్స్: ఆ దమ్ము ఒక్కరికే ఉంది</strong>చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన రాఘవ లారెన్స్: ఆ దమ్ము ఒక్కరికే ఉంది

అయితే ఆదాయానికి మించిన ఆక్రమాస్తుల కేసులో శశికళ దోషి అంటూ తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు వెంటనే లొంగిపోవాలని శశికళకు, ఇళవరసి, దివాకరన్ లకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినా ఈ రోజు రాత్రి ఆమెను చెన్నైలోని పెట్టి బుధవారం బెంగళూరు తరలించాలని తమిళనాడు పోలీసు అధికారులు నిర్ణయించారని తెలిసింది.

English summary
The Supreme Court on Tuesday convicted AIADMK general secretary Sasikala in the Rs 66 crore disproportionate assets case. The apex court also sentenced Sasikala to a prison term of four years, and imposed a fine of Rs 10 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X