బంపర్ ఆఫర్: తమిళనాడుకు కావేరీ నీరు వదలండి

న్యూఢిల్లీ: తమిళనాడుకు ప్రతి రోజు 2,000 క్యూసెక్కుల కావేరీ నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 ఫిబ్రవరి 7వ తేది వరకు మా ఆదేశాలు పాటించాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.

కావేరీ నీరు పంపిణి విషయంలో కావేరి ట్రిబునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. బుధవారం (జనవరి 4, 2017) సుప్రీం కోర్టులో అర్జీ విచారణ జరిగింది.

 The Supreme Court today directed Karnataka to release 2000 cusecs of Cauvery water per day to Tamil Nadu.

తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. వాదనలు విన్న న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఫిబ్రవరి 7వ తేది వరకు ప్రతి రోజు 2,000 క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదికి వాయిదా వేశారు. తమిళనాడుకు 2,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 740 టీఎంసీల కావేరీ నీరులో కర్ణాటక కు 270 టీఎంసీలు, తమిళనాడుకు 419 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీరు పంపిణి చెయ్యాలని, 14 టీఎంసీల నీరు మిగులు జలాలుగా ఉపయోగించాలని కావేరి ట్రిబునల్ గతంలో తీర్పు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+