అబ్దుల్ కలాంకు ప్రముఖుల నివాళి (వీడియో)
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం మద్యాహ్నాం ఢిల్లీ తీసుకు వచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుండి కలాం భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకు వచ్చారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ తదితరులు పాలెం విమానాశ్రయం చేరుకుని కలాం భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
అనంతరం పాలెం విమానాశ్రయం నుండి టెన్ రాజాజీ మార్గ్ లోని కలాం అధికారిక నివాసానికి పార్థీవదేహం తరలించారు. ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. కలాం అంత్యక్రియలు బుధవారం తమిళనాడులోని రామేశ్వరంలో జరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. కలాం కుటుంబ సభ్యుల కోరిక మేరకు రామేశ్వరంలో ప్రభుత్వ లాంచనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఎర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద పార్టీల నాయకులు అంత్యక్రియలలో పాల్గోంటున్నారు.












Click it and Unblock the Notifications