Train Accident: ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. తప్పిన ప్రాణనష్టం..
ఈ మధ్య తరుచూగా ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. అయితే ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్లాట్ పామ్ ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. రైలు ప్లాట్‌ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
"షకుర్ బస్తీ నుంచి వస్తున్న ఈఎంయూ(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) ట్రైన్ 10:49 గంటలకు మధుర స్టేషన్‌కు వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది" అని మధుర స్టేషన్ డైరెక్టర్ ఎస్.కే. శ్రీవాస్తవ వెల్లడించారు.

మంగళవారం జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చిన సంగతి తెలిసిందే. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగిలో ఒక్కసారిగా పొగలు వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళుకు గురై రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్రైన్ ను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నిలిపారు. రైలు ఆగగానే ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. ప్రయాణికులు రైలు ఏలూరు రైల్వే స్టేషన్ ఉండగానే పొగలు రావడం గుర్తించారు. అధికారులకు తెలపడంతో పొగలు రాకుండా మరమ్మతు చేశారు.
రైలులో మళ్లీ పొగలు రావడంతో తాడేపల్లి గూడెం వద్దు నిలివేశారు. ట్రైన్ బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 4 రోజుల క్రితం గుజరాత్‌లోని వల్సాడ్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి. తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ రూట్ లో వల్సాడ్ స్టేషన్ సమీపంలోకి వచ్చిన సమయంలో రైలులో మంటలు చెలరేగాయి. పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి - పగిడిపల్లి మధ్య ట్రైన్ లో మంటలు వచ్చాయి. రెండు భోగీల్లో నుండి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలుని నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపారు. ఎస్-3, ఎస్-4, ఎస్-5, ఎస్-6 భోగీలు మంటల్లో కాలిపోయాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications