Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాధా-రెడ్డి: పందెం కోళ్లు రెడీ: ఆ ఖాళీలతో గెలుపు తారుమారు?

Vice President of India: జగ్ దీప్ ధన్‌ఖర్ ఆకస్మిక రాజీనామా వల్ల ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్లు వెల్లడించింది.

ఎన్నిక ఎందుకు?

ఆరోగ్య కారణాల దృష్ట్యా ధన్ ఖర్ కిందటి నెలలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది ఈసీ. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది.

The Ultimate Showdown NDA vs INDIA VP Candidates-A Statistical Analysis

నామినేషన్లు ఎప్పుడు?

నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఈ నెల 21. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు 25లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ ఉంటుంది. 21వ తేదీ లోపే ఎన్డీఏ- ఇండియా కూటములు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్డీఏ అభ్యర్థి ఎవరు?

ఇదివరకే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఆయనను గెలిపించడానికి తనవంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఇతర నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు.

ఇండియా బ్లాక్ నుంచి ఎవరు?

ఇప్పుడు తాజాగా- కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా బ్లాక్.. తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. తమ ఉమ్మడి అభ్యర్థిగా ఇండియా కూటమి ఆయన పేరును ప్రకటించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు బ్లాక్ నాయకులు.

ఎలక్టోరల్ కాలేజీ వివరాలు ఎలా?

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కూడా ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. రాజ్యసభలోని 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో 543 మంది సభ్యులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారందరూ ఎలక్టోరల్ కాలేజీలో భాగం.

లోక్ సభలో ఖాళీలు?

ప్రస్తుతం లోక్ సభలో ఒకటి, రాజ్యసభలో అయిదు ఖాళీలు ఉన్నాయి. ఆ ఒక్కటీ- పశ్చిమ బెంగాల్ లోని బసీర్ హట్ నియోజకవర్గం. ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు హాజీ నూరుల్ ఇస్లాం.. కన్నుమూశారు. ఇంకా ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

రాజ్యసభలో ఖాళీలు?

245 మంది సభ్యుల బలం ఉన్న రాజ్యసభలో అయిదు ఖాళీలు ఉన్నాయి. ఈ అయిదింట్లో నాలుగు జమ్మూ కాశ్మీర్ కు చెందినవే. మరొకటి పంజాబ్ కు చెందినది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా అసెంబ్లీకి ఎన్నిక కావడం వల్ల ఈ ఖాళీ ఏర్పడింది.

ఎంతమంది ఓటు వేస్తారు?

దీంతో ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకునే సభ్యుల బలం 782. ఈ ఎన్నికలలో గెలవడానికి అభ్యర్థికి 391 ఓట్లు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత ఉంది.

గెలిచే అవకాశాలు ఎవరికి?

లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 542 మంది సభ్యులలో 293 మంది మద్దతు ఉంది. రాజ్యసభలో ఎన్డీఏకు 129 మంది సభ్యుల మద్దతు ఉంది. నామినేటెడ్ సభ్యులు కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేస్తారని భావిస్తున్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+