Viral Video: బుల్లెట్ బండెక్కి వచ్చేతపా అంటున్న పెళ్లికూతురు..
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఘట్టం. అందుకే ఈ పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా.. ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకోవడం, నీటిలో మ్యారేజ్ చేసుకోవడం. పెళ్లి వేదికపైకి ఏదైనా వాహనంలో రావడం చేస్తుంటారు. ఇలా ఓ పెళ్లి కూతురు వినూత్న ప్రయత్నం చేసింది.
బరువైన లెహంగాతో
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో వధువు తన పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వెళ్లింది. బరువైన లెహంగా, నాజూకైన దుపట్టా ధరించిన ఆమె బుల్లెట్ నడిపింది. వీడియోలో ఆమె తన లెహంగాను సర్దుబాటు చేయమని కెమెరాకు దూరంగా ఉన్నవారికి సూచించడాన్ని చూడవచ్చు.

3 లక్షల వ్యూస్
ఆమె అదే బైక్‌పై వేదిక వద్దకు వచ్చినట్లు సమాచారం. పెళ్లి కూతురు బుల్లెట్ నడిపిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పెళ్లి కూతురు చాలా గొప్ప చేశారని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఈ పెళ్లి గుర్తుండి పోతుందని కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications