Wife: మొగుడు మొద్దునిద్ర, పాండ్స్ పౌడర్ లాంటి ప్రియుడితో పండగ, సెప్టిక్ ట్యాంక్ లో శవం పూడ్చేసి ?

నోయిడా/ లక్నో: డబ్బు సంపాధించాలని అనుకున్న భర్త అతని భార్య, కూతురితో కలిసి వేరే సిటీకి వెళ్లాడు. ఇదే సమయంలో భర్త దగ్గరకు వచ్చి వెలుతున్న ఓ యువకుడితో భార్య చనువు పెంచుకుంది. రాత్రి మందు కొట్టి గురకపెట్టి మొద్దు నిద్రపోతున్న భర్తతో సుఖసంసారం లేదని అనుకున్న భార్య పాండ్స్ పౌండర్ లాంటి ప్రియుడిని సెట్ చేసుకుంది. మంచిరోజు చూసి ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి భర్త శవాన్ని ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో వేసి పైన సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసిన చేతులు దులుపేసుకున్నారు. భర్తను చంపేసిన భార్య ఆమె ప్రియుడికి స్వర్గం చూపించింది. మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు భార్యకు ఏం చూపిస్తున్నారంటే ?.

యూపీ టూ నోయిడా

యూపీ టూ నోయిడా

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన సతీష్ అనే యువకుడు మేస్త్రీ పని చేస్తున్నాడ. పది సంవత్సరాల క్రితం సతీష్ నీతూ శర్మా అలియాస్ నీతూ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత సతీష్, నీతూ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సతీష్ నీతూ దంపతులకు ఐదు సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉంది. రెండేళ్ల క్రితం సతీష్ అతని భార్య నీతూ, ఐదేళ్ల కూతురితో కలిి నోయిడాకు వెళ్లాడు.

కాంట్రాక్టు పనులు చేస్తున్న భర్త

కాంట్రాక్టు పనులు చేస్తున్న భర్త


నోయిడాలోని సరస్వతి కుంజ్‌ ప్రాంతంలో సతీష్, నీతూ దంపతులు నివాసం ఉంటున్నారు. మేస్త్రీ అయిన సతీష్ కొత్తగా ఇంటిని నిర్మించే కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. ఇదే సమయంలో సతీష్ అతని దగ్గర పని చెయ్యడానికి రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడిని పెట్టుకున్నాడు. భర్త సతీష్ కోసం ఇంటికి వచ్చి వెలుతున్న రాకేష్ తో నీతూ పరిచయం పెంచుకుంది.

ప్రియుడు పాండ్స్ పౌడర్ లాంటివాడు

ప్రియుడు పాండ్స్ పౌడర్ లాంటివాడు

నీతూ భర్త సతీష్ కు ప్రతిరోజు మద్యం సేవించే అలవాటు ఉంది. రాత్రి మద్యం సేవిస్తున్న సతీష్ బాగా నిద్రపోతున్నాడు. ఇదే సమయంలో భర్త సతీష్ దగ్గరకు వచ్చి వెలుతున్న రాకేష్ అనే యువకుడితో నీతూ చనువు పెంచుకుంది. రాత్రి మందు కొట్టి గురకపెట్టి నిద్రపోతున్న భర్త సతీష్ సుఖసంసారం లేదని అనుకున్న నీతూ పాండ్స్ పౌండర్ లాంటి రాకేష్ ను ప్రియుడిగా సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

జనవరి రెండో తేదీ రాత్రి ?

జనవరి రెండో తేదీ రాత్రి ?

చాలాకాలం నుంచి ప్రియుడు రాకేష్ కు నీతూ స్వర్గం చూపిస్తోంది. ప్రియుడు రాకేష్ నీతూ ఆమె కోరికలు అన్నీ తీర్చుకుంటున్నది. జనవరి రెండో తేదీ రాత్రి సతీష్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి దాటిన తరువాత నీతూ, ఆమె ప్రియుడు రాకేష్ పక్కరూమ్ లో రోమాన్స్ చేశారు. తరువాత అదే రోజు రాత్రి నీతూ, ఆమె ప్రియుడు రాకేష్ కలిసి సతీష్ గొంతునులిమి చంపేశారు.

భార్య మిడ్ నైట్ మసాలా, ఉదయం ప్రియుడికి ?

భార్య మిడ్ నైట్ మసాలా, ఉదయం ప్రియుడికి ?


భర్త సతీష్ ను హత్య చేసిన నీతూ ఆమె ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ ఏంజాయ్ చేస్తోంది. జనవరి 10వ తేదీ వరకు సతీష్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతని సోదరుడికి అనుమానం వచ్చి నోయిడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నీతూ మీద నిఘా వేశారు. నీతూ ఇంటికి వెలుతున్న రాకేష్ రాత్రిపూర్తిగా ఆమె ఇంటిలోనే ఉంటున్నాడని పోలీసులు గమనించారు. ఉదయం ప్రియురాలు నీతూ ఇంటి నుంచి బయటకు వస్తున్న రాకేష్ ను పోలీసులుఅదుపులోకి తీసుకుని అతన్ని బెండ్ తీశారు.

సెప్టిక్ ట్యాంక్ లో భర్త శవం

సెప్టిక్ ట్యాంక్ లో భర్త శవం


పోలీసుల విచారణలో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది, ఆ రోజు రాత్రి సతీష్ మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య నీతూ, ఆమె ప్రియుడు రాకేష్ కలిసి సతీష్ మళ్లీ మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న భర్త సతీష్ ను ప్రియుడు రాకేష్ తో కలిసి నీతూ హత్య చేసింది. భర్త శవాన్ని రాత్రికి రాత్రి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోని సెప్టిక్ ట్యాంక్ లోకి తీసుకెళ్లి పూడ్చేశారు.

ప్రియుడి మోజులో ఎంతపని చేసింది ?

ప్రియుడి మోజులో ఎంతపని చేసింది ?

మరుసటి రోజు వేరే వ్యక్తి సహాయంతో నీతూ, రాకేష్ కలిసి మరో వ్యక్తి సహాయంతో సతీష్ శవం పూడ్చి పెట్టిన ప్రాంతం మీద సిమెంట్ తో ప్లాసింగ్ చేసేశారని డీసీపీ విశాల్ పాండే మీడియాకు చెప్పారు. సతీష్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నీతూ, ఆమె ప్రియుడిని అరెస్టు చేశామని, పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని డీసీపీ విశాల్ పాండే అన్నారు. ప్రియుడి మోజులో భార్య ఆమె భర్తను హత్య చేసి ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చి పెట్టడం కలకలం రేపింది. ప్రియుడి వ్యవహారం గురించి భర్తకు తెలీకుండా అతని భార్య చాలా జాగ్రత్తలు తీసుకందని, ఇదే సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న ప్రియుడు కూడా అతని యజమానికి మ్యాటర్ లీక్ కాకుండా చూసుకున్నాడని, చివరికి ఇద్దరిని నమ్మిన భర్త దారుణ హత్యకు గురైనాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+