ప్రియుడి మోజులో పడిపోయిన ఫేమస్ సింగర్ భార్య, అర్దరాత్రి రసపట్టులో ఉంటే !
బెంగళూరు/కోలారు: జనపద గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువకుడు పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత అతను పాటలు పాడుతూ, కచేరీలు చేస్తూ బిజీ అయ్యాడు. జానపద గాయకుల సంఘం అధ్యక్షుడిగా, మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్న ఆ గాయకుడు అక్రమ సంబంధం విషయంలో దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
భార్య అక్రమ సంబంధానికి సింగర్ హత్యకు గురి కావడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని కోలారు సమీపంలోని కన్నఘట్టి ప్రాంతంలో జనపద గాయాకుడు క్రిష్ణమూర్తి అలియాస్ జన్నఘట్ట క్రిష్ణమూర్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన సౌమ్యా అనే యువతిని జానపద గాయకుడు క్రిష్ణమూర్తి పెళ్లి చేసుకున్నాడు.

వివాహం చేసుకున్న తరువాత సౌమ్యా ఆమె భర్త క్రిష్ణమూర్తితో సంతోషంగా కాపురం చేసింది. ఇదే సమయంలో కోలారు జిల్లాలోని శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్న శ్రీధర్ అనే యువకుడు సౌమ్యాకు పరిచయం అయ్యాడు. తరువాత సౌమ్యా మీద మోజు పడిన శ్రీధర్ ఆమెను చిన్నగా ముగ్గులోకి దింపాడు.
ఎప్పుడు ఆర్కెస్ట్రాలు, పాటలు, కచేరీలు అంటూ బయట తిరుగుతున్న భర్త క్రిష్ణమూర్తికి మస్కా కొట్టిన సౌమ్యా ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీధర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త బయటకు వెళ్లిన తరువాత సౌమ్యా ప్రియుడు శ్రీధర్ తో కలిసి షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.
భార్య సౌమ్యా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న సింగర్ క్రిష్ణమూర్తి ఆమెను హెచ్చరించాడు. అయితే అప్పటికే ప్రియుడు శ్రీధర్ మోజులో పడిపోయిన సౌమ్యా భర్త క్రిష్ణమూర్తికి దూరం కావాలని డిసైడ్ అయ్యింది. భర్త క్రిష్ణమూర్తి విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతో సౌమ్యా అయోమయంలో పడిపోయింది.

సోమవారం రాత్రి ప్రియుడు శ్రీధర్ తో కలిసి సౌమ్యా ఆమె ఊరి బయట ఎంజాయ్ చేస్తోంది. ఆ సమయంలో భార్య సౌమ్యా ఎందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని చూడాలని జానపద గాయకుడు క్రిష్ణమూర్తి వెళ్లాడు. ఆ సమయంలో సౌమ్యా, ఆమె ప్రియుడు శ్రీధర్ మంచి రసపట్టులో ఉన్న విషయం గుర్తించిన సింగర్ క్రిష్ణమూర్తి రగిలిపోయాడు.
తరువాత భార్య సౌమ్యా, ఆమె ప్రియుడు శ్రీధర్ ను పట్టుకుని చితకబాదిన క్రిష్ణమూర్తి మీ అంతు చేస్తానని హెచ్చరించాడు. స్రియుడు శ్రీధర్ కు తోడుగా వెళ్లిన శ్రీధర్ రావ్ అనే యువకుడు కలిసి క్రిష్ణమూర్తిని చితకబాదేశారు. సౌమ్యా, ఆమె ప్రియుడు శ్రీధర్, శ్రీధర్ స్నేహితుడు శ్రీధర్ రావ్ కలిసి సింగర్ క్రిష్ణమూర్తిని చంపేశారు.
సింగర్ క్రిష్ణమూర్తి హత్య కేసులో అతని భార్య సౌమ్యా, ఆమె ప్రియుడు శ్రీదర్, వీరి స్నేహితుడు శ్రీధర్ రావ్ ను అరెస్టు చేశామని మంగళవారం కోలారు పోలీసులు తెలిపారు. కోలారు జిల్లా జానపద గాయకుల సంఘం అధ్యక్షుడిగా, కర్ణాటక మానవహక్కుల సంఘం( సాంస్కృతిక విభాగం) రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్న సింగర్ క్రిష్ణమూర్తి అతని భార్య సౌమ్యా అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురికావడం కోలారు జిల్లాలో కలకలం రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications