రాత్రి ఇద్దరితో గడపాలని టార్చర్ పెట్టిన చిన్ననాటి ఫ్రెండ్స్, వివాహిత మహిళ ?

చిన్ననాటి స్నేహితులు మా కోరిక తీర్చాలని, మూడు రాత్రాలు మాతో గడపాలని ప్రతిరోజు ఫోన్లు చేసి మెసేజ్ లు పంపిస్తూ ఓ వివాహితను చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో ఉరివేసుకుని ఆ గృహిణి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో చోటుచేసుకుంది. మృతురాలు డెత్ నోట్ రాసి అందులో ఇద్దరు యువకుల పేర్లు రాసింది.

ప్రతిరోజూ భర్త ఉదయం పనికి వెళితే సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అయితే భర్త డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో ఉన్న భార్య డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న గృహిణి పేరు మమత (31) అని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని బాగల్‌గుంటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిడేహళ్లిలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.డ్యూటీకి వెళ్లిన భర్త రాత్రి ఇంటికి వెళ్లి ఎన్నిసార్లు తలుపు తట్టినా అతని భార్య మమత తలుపు తీయలేదు.

The woman committed suicide after her friends tortured her to give her physical comfort

అనంతరం మరో తాళంతో తలుపులు తెరిచి చూడగా భార్య మమత కిటికీకి వేలాడుతూ శవమై కనిపించింది.దీంతో వెంటనే భర్త పోలీసులకు సమాచారం అందించాడు. బాగల్‌గుంటే స్టేషన్‌ పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక ఆధారాలు, సమాచారాన్ని సేకరించారు. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు మమత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గృహిణి మమత మృతదేహం లభ్యమైన స్థలంలో పోలీసులకు డెత్ నోట్ లభించింది. దాన్ని తనిఖీ చేసిన పోలీసులు అందులో ఇద్దరు యువకుల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె కాలేజ్ క్లాస్ మేట్స్ అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని పోలీసులు అన్నారు. మృతురాలు మమత అతని కాలేజ్ స్నేహితులు అశోక్, గణేష్‌లు తన ఆత్మహత్యకు కారణం అని డెత్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు.

The woman committed suicide after her friends tortured her to give her physical comfort

తనకు ఏదైనా జరగరానిది జరిగితే మీరే బాధ్యులు అంటూ గణేష్, అశోక్ అనే ఇద్దరు యువకుల పేర్లు రాసిన మమత తరువాత ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. నువ్వు మాకు సహకరించాలి, ఒక రాత్రి మనం ముగ్గురూ బయటకు వెళ్దాలని, రాత్రి మొత్తం మాతో నువ్వు గడపాలని ఇద్దరు నిందితులు మమతకు మెసేజ్ లు పెట్టి వేధించేవారని, నువ్వు మాతో రాత్రి గడపకపోతే నీ కాపురం నాశనం చేస్తామని నిందితులు అశోక్, గణేష్ తనను బెదిరించారని మమత డెత్ నోట్ లో రాసిందని పోలీసులు తెలిపారు.

నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తామంటూ ఇద్దరు నిందితులు అసభ్యకరమైన సందేశాలను మమతకు పంపారు. ఇదంతా మమత ఆమె రాసిన డెత్‌నోట్‌లో ప్రస్తావించింది.ఇలా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన వారు మమత కాలేజ్ స్నేహితులు అని, నిందితుల వేధింపులకు భయపడి మమత తన ఇంటి కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, మమత ఆత్మహత్య చేసుకోవడంతో నిందితులు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారని పోలీసులు అన్నారు, మమత భర్త లోకేష్ బాగలగుంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డెత్ నోట్ ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+