వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: జ్యూస్‍లో మత్తు మందు కలిపింది.. స్పృహ తప్పిన తర్వాత బట్టలూడదీసింది..

|
Google Oneindia TeluguNews

ఓ మహిళ చేసిన పని స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. దావణగెరెలోని సరస్వతీ నగర్ లో యశోద అనే 32 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు శివకుమారస్వామి లేఔట్‌కు చెందిన చిదానందప్ప వృద్ధుడితో పరిచయం ఏర్పడింది.దీంతో చిదానందప్ప యశోద ఇంటికి తరుచూగా కాఫీ తాగాడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో తనకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని.. కొంత అప్పు కావాలని యశోద చిదానందప్పను అడిగింది.

రూ.86 వేల అప్పు

రూ.86 వేల అప్పు


జాలి పడిన చిదానందప్ప దఫా దఫాలుగా యశోదకు రూ.86 వేలు ఇచ్చాడు. కొద్ది కాలం తర్వాత తనకు డబ్బు అవసరం ఉందని అప్పు చెల్లించాలని చిదానందప్ప యశోదను కోరాడు. ఆమె డబ్బు ఇస్తానంటూ వాయిదా వేస్తూ వస్తుంది. ఈ క్రమంలో యశోద ఓ ప్లాన్ వేసింది. చిదానందప్పకు మత్తు మందు ఇచ్చి.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా.. మెడికల్ షాపుకు వెళ్లి స్లిపింగ్ ట్యాబ్లేట్లు తెచ్చుకుంది.

మత్తు మందు

మత్తు మందు


ఒక రోజు వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్తున్న చిదానందప్పను కాపీ తాగడానికి పిలిచింది. అయ్యో పాలు లేవు.. జ్యూస్ తాగండాని కోరింది. జ్యూస్ లో మత్తు మందు కలిపి చిదానందప్పుకు ఇచ్చింది. అతను స్పృ హ కోల్పోగానే బట్టలూడదీసింది. అతడిని నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీసింది. కొన్ని గంటల తరువాత స్పృహలోకి వ్చిచన చిదానందప్ప ఒంటి మీద బట్టలు లేకపోవడంతో కంగారు పడ్డాడు. బట్టలు వేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు.

బ్లాక్ మెయిల్

బ్లాక్ మెయిల్


మూడు రోజుల తర్వాత చిదానందప్పకు యశోద ఫోన్ చేసి తన వద్ద నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయని బెదిరించింది. రూ.10 లక్షలు ఇవ్వాలని లేకుంటే నీ వీడియో అందరికి పంపిస్తానని హెచ్చరించింది. ఆందోళన చెందిన చిదానందప్ప తన స్నేహితులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో చిదానందప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యశోదను పోలీసులు అరెస్ట్ చేసి వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
A woman blackmailed an old man. The incident took place in Karnataka. The police registered a case and arrested the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X