ఒకే మహిళతో అన్నదమ్ముల అక్రమ సంబంధం, రాత్రి చీకటిలో ఏం జరిగిందంటే ?
ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ విషాదంగా మారింది. చివరికి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి ఒకరి హత్యకు దారితీసింది. యవ్వనంలో ఉన్న ఇద్దరు యువకులకు వలవేసి ఒకరికి తెలీకుండా ఒకరితో ఎంజాయ్ చేస్తున్న కిలాడీ లేడీ మాత్రం ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలాగా డ్రామాలు ఆడుతోంది.
బెంగళూరు నగర శివార్లలోని డాబస్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోంపూర్ తాలుకాలోని ఎలచేనహళ్లిలో మాలలకుంటే గ్రామానికి చెందిన నాగేష్ (25) అనే యువకుడు హత్యకు గురైనాడు. అదే గ్రామానికి చెందిన నవీన్ (22) అనే యువకుడు తన అన్న నాగేష్ ను హత్య చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. మాలలకుంటే గ్రామానికి చెందిన నాగేష్, నవీన్ అనే ఇద్దరు చిన్నాన, పెదనాన్నల పిల్లలు.

దాయాదుల కుమారులైన నవీన్, నాగేష్ చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా కలిసి మెలసి తిరుగుతున్నారు. నవీన్, నాగేష్ ఇద్దరూ వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఎలిక్యాతనహళ్లికి చెందిన ఓ వివాహిత మహిళతో వారిద్దరికీ పరిచయం ఉంది. వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తోంది. అయితే తనకు పరిచయం ఉన్న నాగేష్ ను ముందుగా ముగ్గులోకి దింపిన వివాహిత మహిళ అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.
కొంతకాలం తరువాత నాగేష్ తమ్ముడు నవీన్ కు వలవేసిన వివాహిత మహిళ అతనితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకరికి తెలీకుండా ఒకరిని కలుస్తున్న వివాహిత మహిళ ఆమె కామకోరికలు తీర్చుకుంటూ వారి దగ్గర డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే కొంతకాలం క్రితం నాగేష్ అక్రమ సంబంధం గురించి నవీన్ కు తెలిసిపోయింది. ఇదే సమయంలో తన ప్రియురాలితో నవీన్ తిరుగుతున్నాడని తెలుసుకున్న నాగేష్ కూడా రగిలిపోయాడని సమాచారం.

మహిళ ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయమై తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారు. నిందితుడు నవీన్ రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఉన్న నాగేష్ కు ఫోన్ చేసి ఎల్యక్యాతనహళ్లి గ్రామానికి పిలిపించాడు. తరువాత రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ తరువాత పొలంలో చీకటిలో నడుచుకుంటూ వెలుతున్న సమయంలో మద్యం మత్తులో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ విషయంలో నాగేష్, నవీన్ గొడవ పడ్డారు. తరువాత సహనం కోల్పోయిన నవీన్ చికటిలోనే కత్తి తీసుకుని అతని అన్న నాగేష్ ను పొడిచేశాడు.
హత్యకు పాల్పడిన నవీన్ తన అన్న నాగేష్ మొబైల్ ఫోన్ నుంచి అంబులెన్స్‌కు ఫోన్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అంబులెన్స్ వచ్చే సమయానికి నగేష్ చనిపోయి శవమైకనిపించాడు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు.
తరువాత పోలీసులు నవీన్‌ను విచారించగా నేను హత్య చేయలేదని, ఆ హత్యకు నాకు ఎలాంటి సంబందం లేదని మాయమాటలు చెప్పి పారిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని బెండ్ తీసి విచారించగా నిందితుడు నవీన్ మహిళతో అక్రమ సంబందం పెట్టుకునే విషయంలో తానే తన అన్న నాగేష్ ను హత్య చేశానని అసలు విషయం బయటపెట్టాడు.












Click it and Unblock the Notifications