Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: మహిళ హత్య కేసులో ట్విస్ట్, ఆ విషయంలో ఓనర్ మీద కక్ష పెంచుకుని, ఫ్రెండ్ తో ?

బెంగళూరు/హాసన్: భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అతిదారుణంగా హత్య చేసి పరారైనారు. పట్టపగలు మహిళ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. నిందితులు మాస్క్ లు వేసుకుని వెళ్లి హత్య చెయ్యడంతో వారి ముఖాలు ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో తలపట్టుకున్నారు. చివరికి బుధవారం హంతకులు పోలీసులకు చిక్కిపోయారు. మహిళను ఎందుకు హత్య చేశారు అని పోలీసులు ఆరా తీశారు. నిందితులు చెప్పిన మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు, మహిళ కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 పట్టపగలు మహిళ హత్య

పట్టపగలు మహిళ హత్య

కర్ణాటకలోని హాసన్ జిల్లా హోలేనరసీపుర తాలూకాలోని గంగూరు గ్రామంలో జరిగింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత ఇంట్లోకి చొరబడిన నిందితులు మహిళ గొంతు కోసి ఆమెను దారుణంగా చంపేశారు. పార్వతమ్మ (55) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైయ్యింది. పార్వతమ్మ శనివారం ఉదయం 10 గంటలకు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను చంపేశారు. పార్వతమ్మ భర్త రాజేగౌడ శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్లాడు.

 హంతకులు ఎవరు ?

హంతకులు ఎవరు ?

రాజేగౌడ ఇంట్లో లేడని నిర్దారించుకున్న నిందితులు ఆయన ఇంటికి వెళ్లి పార్వతమ్మను హత్య చేసి పరారయ్యారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పార్వతమ్మను అతి దారుణంగా హత్య చేసి దర్జాగా పరారయ్యారు. గంట తరువాత పార్వతమ్మ బంధువు ఇంటికి వెళ్లి చూడగా ఆమె హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పార్వతమ్మను ఎవరు హత్య చేశారనే దానిపై ఎలాంటి క్లూ చిక్కలేదని పోలీసులు అన్నారు. గ్రామంలోకి బైక్ లో వచ్చిన ఇద్దరు ముఖానికి మాస్కులు ధరించారని స్థానికులు పోలీసులకు చెప్పారు. పార్వతమ్మను హత్య చేసి బైక్ లో మాస్క్ లు వేసుకుని ఇద్దరు వెళ్లారని, వాళ్లే హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 పోలీసులకు డౌట్

పోలీసులకు డౌట్

పార్వతమ్మను హత్య చేసిన కొంత సేపటికే ఆఇంటి వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు వేసుకుని బైక్‌ లో వేగంగా వెళ్లిపోయారని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ పోలీసులకు చెప్పింది. పోలీసులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. హోలేనరసీపర గ్రామీణ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అయితే పార్వతమ్మను ఎవరు హత్య చేశారు ? అని ఆరాతీసిన పోలీసులు పార్వతమ్మ ఇంటిలో అద్దెకు ఉన్న షరీఫ్ అనే వ్యక్తి మీద అనుమానం వచ్చింది.

 ఇంటి అద్దె కట్టకుండా తిరిగేశాడు

ఇంటి అద్దె కట్టకుండా తిరిగేశాడు

పార్వతమ్మ, రాజేగౌడ దంపతులు ఇండ్లు కట్టి అద్దెకు ఇచ్చారు. అరకలగూడుకు చెందిన షరీఫ్ పార్వతమ్మ ఇంటిలో అద్దెకు చేరాడు. కొన్ని నెలల క్రితం ఊరికి వెళ్లిన షరీఫ్ తరువాత తిరిగిరాలేదు. కొన్ని నెలల ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు కట్టకపోవడంతో పార్వతమ్మ అతన్ని సంప్రధించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే షరీఫ్ మాత్రం పార్వతమ్మకు కనపడలేదు. షరీఫ్ మీద కోపంతో అతని ఇంటిలో ఉన్న ఫర్నీచర్ ను ఎత్తుకెళ్లిన పార్వతమ్మ ఆమె ఇంటిలో పెట్టుకుంది.

 అద్దె డబ్బులు అడిగారని ఓనర్ ను చంపేశారు

అద్దె డబ్బులు అడిగారని ఓనర్ ను చంపేశారు

కొన్ని రోజుల క్రితం పార్వతమ్మ, షరీఫ్ మద్య అద్దె ఇంటి విషయంలో గొడవ జరిగింది. తన ఇంటిలో వస్తువులు ఎత్తుకెళ్లి తన పరువు తీసిందని రగిలిపోయిన షరీఫ్ కోలారు జిల్లాలోని మాలూరులో నివాసం ఉంటున్న సయ్యద్ అనే స్నేహితుడితో కలిసి పార్వతమ్మను హత్య చేశాడని పోలీసులు అన్నారు. పార్వతమ్మను హత్య చేసిన షరీఫ్, సయ్యద్ కోలారు జిల్లాలో తలదాచుకోవడంతో ఇద్దరిని అరెస్టు చేశామని హాసన్ జిల్లా పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+