నిన్న ఆంధ్రా, నేడు పక్క రాష్ట్రాంలో కాంగ్రెస్ కు సెగ, సీఎం కుర్చి మారిపోతుందని టాక్?
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టనుంది. అయితే ఇంతకు మించి కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే వార్త ఒకటి బయటకు వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల రావడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అసహనంతో ఉందని తెలిసింది. ఇదే సమయంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి స్థానం మారుతుందన్నవార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
2023లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కొత్తకొత్త ప్రయోగాలు చేసిన బీజేపీ హైకమాండ్ నేతల ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ ఓటర్లకు చేసిన ఉచిత హామీ పథకాలు, వాగ్దానాల ఆధారంగా కాంగ్రెస్ అప్పట్లో అధికారం దక్కించుకుంది. మరోవైపు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే. శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం పోటీ నెలకొంది.

ఎట్టకేలకు సిద్ధరామయ్య సీఎంగా ఎన్నికయ్యారు. అదే సమయంలో రెండున్న సంవత్సరాల తరువాత డీకే శివకుమార్ ను సీఎం చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ మాట ఇచ్చింది. ఇప్పుడు ఓ బాంబు లాంటి వార్త బయటకు రావడంతో కాంగ్రెస్ లోని డీకే శివకుమార్ వర్గంలో ఆశలు చిగిరిస్తున్నాయి. ఆ వార్త కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కర్ణాటకలో సీఎం స్థానం మారుతుందన్న వార్త ప్రకంపనలు సృష్టించింది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చేయడంతో కర్ణాటకలో సీఎం మారతారా?, కర్ణాటకలో సీఎం పదవి మారి మరొకరికి సీఎం పదవి దక్కుతుందా అని చర్చ మొదలైయ్యింది. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ రాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఊహించిన ఫలితాలు కర్ణాటకలో రాలేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి హామీ ఇచ్చింది అని చర్చ మొదలైయ్యింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పుకు కాంగ్రెస్ హైకమాండ్ నేతలు శ్రీకారం చుట్టారని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని, అనుకున్న స్థాయిలో ఎంపీ సీట్లు రాకపోవడంతో కర్ణాటకలో కూడా సీఎం పదవిని మార్చే ప్రక్రియ మొదలవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు డీకే. శివకుమార్‌ను సీఎంగా ఎంపిక చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మొత్తానికి కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ఫలితాల రావడం, బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో రాజకీయంగా కలకలం రేపింది. ఇదే దెబ్బతో కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు కానీ, ఆ పార్టీ హైకమాండ్ నాయకులు కానీ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరికొంత కాలం సీఎం మార్పు విషయం గురించి వేచి చూడాల్సిందే అని కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకుడు అంటున్నారు. సీఎం పదవి మార్పు విషయంలో త్వరలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావచ్చు అని ఆ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications