లోకాయుక్త భాస్కర్ రావ్ ఉద్వాసనకు రంగం సిద్దం
బెంగళూరు: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ ను ఇంటికి పంపించడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లోకాయుక్తలో రూ. ఒక కోటి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో ప్రత్యేక బృందం (సిట్) ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఇదే కేసులో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ తో పాటు ఐదు మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో విదాన సభ, విదాన పరిషత్ లో చర్చ జరిగింది. కర్ణాటక లోకాయుక్త చట్టం (సవరణలు)-2015పై ఒక నిర్ణయం తీసుకుని బిల్లు తయారు చేశారు. చట్టపరంగా లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కు ఉద్వాసన పలకాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి.

తరువాత గవర్నర్ కు ఆ బిల్లు పంపించారు. గవర్నర్ వాజుబాయ్ వాల అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 22వ తేదిన బీబీఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి. అందు వలన సెప్టెంబర్ మొదటి వారంలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు.
ఉభయ సభలలో ఈ బిల్లు ప్రవేశ పెడితో ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మొదటి నుండి బీజేపీ, జేడీఎస్ భాస్కర్ రావ్ కు ఉద్వాసన పలకాలని డిమాండ్ చేస్తున్నది. అయితే అంతకు ముందే భాస్కర్ రావ్ రాజీనామా చేస్తారా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications